ఈ మధ్యకాలంలో చాలా కారణాల వల్ల చాలామందికి పెళ్లి ఆలస్యం అవుతూ వస్తుంది.మరికొందరికి వివాహమైన వైవాహిక జీవితం( married life ) ఆనందంగా సాగడం లేదు.
కొంతమంది వివాహ నియమాలు పాటించకుండా సరైన ముహూర్తం లేకుండా పెళ్లిళ్లు చేసుకుంటూ, భవిష్యత్తులో ఎన్నో సమస్యల ను ఎదుర్కొంటున్నారు.ఈ కారణాలన్నీ కాకుండా వివాహ సమస్యలకు అనేక జ్యోతిష్య ( astrology )కారణాలు ఉన్నాయి.
వేద జ్యోతిష్య శాస్త్రంలో ముందస్తు వివాహం కోసం అనేక నివారణలు సూచించారు.రుద్రాక్ష( Rudraksha ) వినియోగం అత్యంత ఖచ్చితమైన శీఘ్ర ప్రభావంగా పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన మరింత సమాచారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఒక అమ్మాయి లేదా అబ్బాయి జాతకంలో గురు గ్రహం( Jupiter ) అనుకూలత వివాహానికి చాలా అవసరం.అలాగే శని గ్రహానికి గురుగ్రహ ప్రభావం అసలు ఉండకూడదు.శని గ్రహం దశ, మహా దశ, అంతర్దశ సప్తమ శని, శని అంగారక దోషాల కారణంగా వివాహం సకాలంలో జరగదు.
ఇంకా చెప్పాలంటే శివుని( Shiva ) ప్రతిరూపమైన రుద్రాక్ష ఆనందంతో పాటు అదృష్టాన్ని తెస్తుంది.ముందస్తు వివాహానికి మార్గం సుగమం చేస్తుంది.కానీ దానిని ధరించడానికి సరైన సమయం, విధానం కచ్చితంగా ఉంటుంది.
రుద్రాక్షలు ఒకటి నుంచి 21 ముఖాల వరకు లభిస్తాయి.అయితే వివాహానికి సంబంధించిన అడ్డంకులను తొలగించడానికి కొన్ని రుద్రాక్షలు మాత్రమే మంచి ఫలితాలను ఇస్తాయి.గౌరీ రుద్రాక్షలను శివపార్వతుల( Shiva Parvati ) ప్రతిరూపంగా భావిస్తారు.
ఈ రుద్రాక్ష వివాహంలో ఆనందానికి మూలం.దీనిని ధరించడం వల్ల వివాహ అడ్డంకులు, గృహ దోషాలు తొలగిపోయి త్వరగా వివాహానికి మార్గం సుగమం అవుతుంది.
అయితే ఈ రుద్రాక్ష పొందడం ఎంతో కష్టం.ఇంకా చెప్పాలంటే రెండు ముఖాల రుద్రాక్షలు వివాహం కాని వారికి వరం అనే చెప్పవచ్చు.
వీటిని ధరించడం వల్ల వివాహ సంబంధమైన ఆటంకాలను అధిగమించవచ్చు.ఇది ముందస్తు వివాహ అవకాశాలను పెంచుతుంది.
ఈ రుద్రాక్ష ధారణతో వైవాహిక జీవితంలో ఆనందం అదృష్టం సంపదలతో పాటు శాంతినిస్తుంది.
DEVOTIONAL