రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన జరిగింది.మైలార్దేవ్పల్లిలో నవ వధువు బలవన్మరణం చెందింది.
అత్తింటి వేధింపులు తాళలేక ఇంటిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని వధువు కవిత ఆత్మహత్యకు పాల్పడింది.ఏడు నెలల క్రితం శేఖర్ అనే వ్యక్తితో కవితకు వివాహం అయింది.
పెళ్లి అయిన కొద్ది రోజులకే అదనపు కట్నం తేవాలని మానసికంగా, శారీరకంగా చిత్ర హింసలకు గురి చేశారని తెలుస్తోంది.భర్తతో పాటు అత్త, ఆడపడుచు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుందని సమాచారం.
రంగంలోకి దిగిన మైలార్దేవ్పల్లి పోలీసులు నలుగురిపై 304 బీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.