ప్రపంచవ్యాప్తంగా అల్లం టీ( Ginger Tea ) మరియు గ్రీన్ టీ( Green Tea ) అత్యంత ప్రసిద్ధి చెందాయి.హెల్త్, ఫిట్‌నెస్ పై శ్రద్ధతో చాలా మంది ఈ పానీయాలను తమ డైట్ లో చేర్చుకుంటున్నారు.
అయితే అల్లం టీ మరియు గ్రీన్ టీలలో ఏది బెస్ట్? అనే సందేహం ఎందరికో ఉంది.వాస్తవానికి అల్లం టీ, గ్రీన్ టీ. రెండూ ఆరోగ్యకరమైనవే.రెండింటికీ ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయి.
అల్లం టీ బాక్టీరియా, వైరస్‌లపై పోరాడే గుణాలు కలిగి ఉంటుంది.రోగ నిరోధక వ్యవస్థను( Immunity Power ) బలపరిచి ఫ్లూ, జ్వరం లాంటి సమస్యలను త్వరగా తగ్గిస్తుంది.
ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, గాయాలు నుంచి అల్లం టీ ఉపశమనం కల్పిస్తుంది.మెటాబాలిజం పెంచి కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.అల్లం టీ రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించి హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా రక్షిస్తుంది.అలాగే మలబద్ధకాన్ని( Constipation ) తగ్గించడంలో, శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరచడంలో, చలి నుంచి తట్టుకునే సామర్థ్యాన్ని అందించడంలోనూ అల్లం టీ అద్భుతంగా తోడ్పడుతుంది.

గ్రీన్ టీ విషయానికి వస్తే.శరీరంలో ఫ్యాట్ బర్న్ చేయడానికి సహాయపడుతుంది.మానసిక చురుకుదనాన్ని పెంచుతుంది.టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి గ్రీన్ టీ బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది.గ్రీన్ టీలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.అంతేకాకుండా గ్రీన్ టీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.యవ్వనమైన, మెరిసే చర్మాన్ని ప్రోత్సహిస్తుంది.

ఇక గ్రీన్ టీ మరియు అల్లం టీలను వయసు, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ఎంచుకోవాలి.బరువు తగ్గాలని కోరుకునేవారికి గ్రీన్ టీ బెటర్.జీర్ణ సమస్యలు లేదా చలికి గురయ్యే వారు అల్లం టీ తాగడం మంచిది.
రోజువారీ ఉపయోగానికి రెండు టీలు మేలే.అయితే ఒకేసారి కాకుండా ఉదయాన్నే గ్రీన్ టీ, రాత్రి లేదా భోజన తర్వాత అల్లం టీ తాగొచ్చు.







