పాప్‌కార్న్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.థియేటర్‌లో సినిమా చూసినా, ఇంట్లోనే టీవీ చూసినా.
చేతిలో పాప్ కార్న్ లేకుంటే ఏదో వెలితిగానే ఉంటుంది.ఇక సాయంత్రం వేళ కూడా చాలా మంది పాప్ కార్న్‌ను స్నాక్స్‌గా తీసుకుంటుంటారు.
మొక్కజొన్నల నుంచి తయారు చేసే పాప్ కార్న్ రుచిని పిల్లలే కాదు పెద్దలు అనే అమితంగా ఇష్టపడతారు.రుచిలో కాదు.
పాప్ కార్న్‌లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలూ నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్యానికి కూడా పాప్ కార్న్ ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా ప్రస్తుత వర్షాకాలంలో పాప్ కార్న్ ఒక హెల్తీ స్నాక్‌గా చెప్పుకోవచ్చు.అవును, వర్షాకాలంలో పాప్ కార్న్‌ను తీసుకోవడం వల్ల బోలెడన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.
మరి లేట్ చేయకుండా అవేంటో ఓ లుక్కేసేయండి.సాధారణంగా ఈ సీజన్‌లో రోగ నిరోధక శక్తి పడిపోతుంటుంది.
దాంతో వైరన్ ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎటాక్ చేస్తుంటాయి.అయితే రెగ్యులర్ గా ఒక కప్పు పాప్ కార్న్ తీసుకుంటే గనుక.
ఇమ్యూనిటీ పవర్ సూపర్‌గా పెరుగుతుంది.ఫలితంగా జబ్బులకు దూరంగా ఉంటాయి.
వర్షాకాలంలో అధికంగా వేధించే సమస్యల్లో జలుబు ఒకటి.అయితే జలుబును నివారించడంలో పాప్ కార్న్ ఒక మెడిసిన్‌లా పని చేస్తుంది.పాప్ కార్న్ తీసుకుంటే.అందులో ఉండే పాలీఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ జలుబును సూపర్ ఫాస్ట్‌గా తరిమికొడుతుంది.
అలాగే దగ్గు, శ్వాస సంబంధిత సమస్యలను కూడా పాప్ కార్న్ నివారించగలదు.అయితే పాప్ కార్న్‌ను ఉప్పు వేయకుండా తీసుకోవాలి.

పాప్ కార్న్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల.జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.మధుమేహం అదుపులో ఉంటుంది.గుండె ఆరోగ్యం పెరుగుతుంది.ఎముకలు దృఢంగా మారతాయి.వృద్ధాప్య ఛాయల దరి చేరకుండా ఉంటాయి.
క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది.ఇక పాప్ కార్న్ తినడం వల్ల బరువు పెరుగుతారన్న భయమే అక్కర్లేదు.
ఎందుకంటే, పాప్ కార్న్‌లో కేలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ.సో.వీటిని తీసుకుంటే బరువు పెరగడం కాదు తగ్గుతారు.