సాధారణంగా స్టార్ హీరోల వారసులు చిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇస్తున్నారు అంటే చాలు ఆ హడావిడి ఏ రేంజిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అప్పటి వరకు తండ్రులను ఆదరించిన వారు ఆ తర్వాత వారి వారసులను కూడా అదే రీతిలో ఆదరించ డానికి సిద్ధమై పోతు ఉంటారు.
అంతే కాకుండా కాస్త స్టార్ బ్యా గ్రౌండ్ ఉంది అంటే చాలు ఇక మొదటి సినిమాను ఎంతో గ్రాండ్ గా తీయడం లాంటివి చేస్తూ ఉంటారు.కొన్ని కొన్ని సార్లు ఎవరు నిర్మాతలు ముందుకు రావడం కాదు స్వయంగా ఇక తండ్రులే వారి వారసుల సినిమాలు నిర్మించడం కూడా చేస్తూ ఉంటాడు.
అంతే కాదు ఇక తమ వారసులను మొదటి సినిమాకు ఒక ఆసక్తికర టైటిల్ ఆలోచించి మరి ఎంతో జాగ్రత్త పడుతూ ఉంటారు.ఇప్పటి వరకు స్టార్ హీరోల వారసులుగా తెలుగు ఎంట్రీ ఇచ్చిన వారిలో కొంత మంది తమ మొదటి సినిమాకు ఇక వారి పేరునే టైటిల్ గా పెట్టడం లాంటివి కూడా చేశారు.
ఇక అలాంటి హీరోలు ఇద్దరు ఉన్నారు అని చెప్పాలి.అక్కినేని నాగార్జున వారసుడుగా అఖిల్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ క్రమంలోనే తన డెబ్యూ మూవీకి తన పేరునే టైటిల్ గా పెట్టుకున్నాడు.ఇక అఖిల్ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం సాధించ లేదు.
ఇక అఖిల్ ఎంట్రీ పై భారీ అంచనాలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే మిగిలింది.

ఇకపోతే ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ వున్న హీరోగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు గా కొనసాగుతున్న మంచు విష్ణు మోహన్ బాబు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు.ఇక తన కొడుకు మొదటి సినిమాను ఏకంగా లక్ష్మీప్రసన్న క్రియేషన్స్ పతాకంపై స్వయంగా మోహన్ బాబు నిర్మించడం గమనార్హం.ఇక ఈ సినిమా ప్రారంభ వేడుకలకు టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలు అందరూ కూడా ఎంట్రీ ఇచ్చారు.
అయితే మోహన్ బాబు కొడుకు విష్ణు మొదటి సినిమాకు ఇక తన పేరునే టైటిల్గా పెట్టారు.విష్ణు అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా అనుకున్నంతగా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు అని చెప్పాలి.