ఈ మధ్యకాలంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు.ఈ ఊబకాయం సమస్య ప్రస్తుతం అందరిని వేధిస్తుంది.
ఎందుకంటే ఆహార అలవాట్లలో పలు మార్పుల వల్ల ఈ సమస్య అందరినీ పట్టిపీడిస్తోంది.ఎందుకంటే ప్రస్తుత జీవనశైలితో పాటు సాధారణ కార్బోహైడ్రేట్లో ట్రాన్స్ సంతృప్తకు కొవ్వులపై ఎక్కువగా ప్రజలు ఆధారపడుతున్నారు.
దీనివల్ల బాడీ మాస్ ఇండెక్స్ స్కేల్ 25 పాయింట్ల కంటే ఎక్కువగా వస్తే మాత్రం దాన్ని ఊబకాయం అంటారు.
అయితే ఈ సమస్య వల్ల జీవక్రియ రుగ్మతలు, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు కూడా వస్తాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అయితే అధిక ఊబకాయం సమస్యకు కొన్ని ఆహార అలవాట్లే కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు.అందుకే ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని అలవాట్లు మానుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
అయితే ఆ అనారోగ్య అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే అధిక మాంసం తినడం మంచిది కాదు.ఎందుకంటే మాంసంలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి.అదేవిధంగా లీన్ కండరాలు ద్రవ్యరాశికి కూడా మాంసం మద్దతు ఇస్తుంది.
ఇది కాలక్రమేణా కొవ్వు ద్రవ్యరాశిని తగ్గించడంలో సహాయపడుతుంది.అయితే రోజంతా క్యాలరీలు తీసుకోవడం పై ఇది ప్రభావం చూపుతుంది.
అందుకే మన బరువు సమానమైన గ్రాముల ప్రోటీన్లు ఒకే రోజులో తీసుకుంటే సరిపోతుంది.అంతేకానీ అధికంగా మహంసాహారం తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ల కంటే అధిక ప్రోటీన్లు అందుతాయి.

దీనివల్ల ఊబకాయం సమస్య వస్తుంది.ఇక చక్కెర పానీయాలను కూడా దూరం పెట్టడం మంచిది.చక్కెర పానీయాలు జీవక్రియ రుగ్మతలను పెంచడంలో అలాగే బరువు పెరగడంలో కూడా బలమైన సంబంధం ఉంది.పండ్ల రసాలు, సోడాలు లేదా మిక్సర్లు లేదా ఎనర్జీ డ్రింక్స్ అయినా ఇలాంటి చక్కెర పానీయాలు ఊబకాయానికి దారితీస్తుంది.
అందుకే పోషకాహార నిపుణులు చక్కెర పానీయాలను వదిలేయాలని సూచిస్తూ ఉంటారు.అదేవిధంగా ఊబకాయం సమస్య నుండి బయటపడడానికి డైట్ మేనేజ్మెంట్ తో పాటు వ్యాయామం కూడా తప్పనిసరి.







