పెంపుడు కుక్కలకు భానుమతి, రామకృష్ణ అని పేర్లు పెట్టిన స్టార్ ప్రొడ్యూసర్..?

సినిమా రంగంలో అందరూ మంచి వ్యక్తులే ఉండరు.కొందరు గొడవలు పడటానికి, కాంట్రవర్సీలు క్రియేట్ చేయడానికి ఇష్టపడతారు.

 Producer Names His Dogs Bhanumathi And Rama Krishna , Nari Nari Naduma Murari,-TeluguStop.com

నటీనటులను హర్ట్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు.అందరూ అకారణంగా ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మరికొంతమంది ఏదో ఒక కారణం వల్ల కోపం పెంచుకొని ఇలాంటి పనులు చేస్తుంటారు.

అలాంటి కాంట్రవర్షియల్ సెలబ్రిటీలలో నిర్మాత, యువరత్న ఆర్ట్స్‌ అధినేత కె.మురారి( Katragadda Murari ) కూడా ఉన్నారు.

ఆయన డిఫరెంట్ స్టోరీలతో 9 సినిమాలు నిర్మిస్తే 8 సూపర్‌హిట్‌ అయ్యాయి.ఈ సినిమాలోని పాటలూ చాలా బాగుంటాయి.

ఆయన తీసిన లాస్ట్ మూవీ “నారీ నారీ నడుమ మురారి (1990)”.సక్సెస్‌ఫుల్‌ ప్రొడ్యూసర్ అయి ఉండి కూడా ఆ తర్వాత ఆయన సినిమాలు తీయలేదనేది అప్పట్లో చర్చినీయాంశమయ్యింది.

ఈ ప్రొడ్యూసర్ ‘నవ్విపోదురుగాక’ పేరిట ఓ బయోగ్రాఫికల్ బుక్‌ కూడా రాశాడు.అందులో ప్రేక్షకుల డౌట్స్ క్లియర్ చేశాడు.

ఆ బుక్‌లో రాసినట్లుగా సినిమాల్లో రాణించాలని కోరికతో మెడిసన్‌ చదువును మధ్యలో వదిలేశాడు.మొదట అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో జాయిన్ అయిన ఆయన 1978లో ప్రొడ్యూసర్‌గా మారాడు.

మొదటగా కె.విశ్వనాథ్‌ డైరెక్టోరియల్ “సీతామాలక్ష్మి” నిర్మించాడు.

ఆపై గోరింటాకు, జేగంటలు, త్రిశూలం, అభిమన్యుడు, సీతారామకళ్యాణం, శ్రీనివాసకళ్యాణం, జానకి రాముడు, నారీ నారీ నడుమ మురారి వంటి సూపర్‌హిట్‌ సినిమాలు నుంచి బాగా ప్రాఫిట్స్ అందుకున్నాడు.ప్రతి సినిమాలోనూ మ్యూజిక్, సాంగ్స్ బాగుండేలాగా జాగ్రత్త పడ్డాడు.

నారీ నారీ నడుమ మురారి( Nari Nari Naduma Murari ) తర్వాత మారిన పరిస్థితులు మురారికి మింగుడు పడలేదు.అందుకే ప్రొడ్యూసర్‌గా కొనసాగడం మానేశాడు.

ఆపై ‘నవ్విపోదురుగాక’ అనే పుస్తకాన్ని రాశాడు.అందులో కొందరు హీరోలను, దర్శకులు, ఇతర సినీ ప్రముఖులను బాగా విమర్శించాడు.

అంతేకాదు, తన పెంపుడు కుక్కలకు భానుమతి, రామకృష్ణ అని పేర్లు పెట్టి షాక్ ఇచ్చాడు.తాను ఎందుకు చేసానో కూడా అతను ఒక టీవీ ఇంటర్వ్యూలో వివరించాడు.

Telugu Narinari, Pet Dogs, Rama Krishna, Tollywood-Movie

ఆయన మాట్లాడుతూ ‘నటి భానుమతి తలమీద పెట్టుకోవాల్సిన దేవత.ఆమెలాంటి గొప్ప పర్సన్‌ను నేను చూడలేదు.అలాగే భానుమతి భర్త రామకృష్ణ మహానుభావుడు.వాళ్ల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది అందుకే ‘రామకృష్ణగారూ.రండి సార్‌’ అని మా పెట్ డాగ్‌ని పిలుస్తా.ఈ పేర్ల వెనక ఒక తమాషా కథ ఉంది.

సినిమా వాళ్ల చరిత్ర గురించి రాసే సమయంలో భానుమతి నుంచి కొన్ని వివరాలు తీసుకుందామనుకున్నా.కానీ ఆమె ఎప్పుడూ నాకు ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.

రోజూ తిప్పించుకుంటూ బాగా విసిగించారు.ఆ క్రమంలో నా స్నేహితుడొకరు రాడ్‌వేలర్‌ బ్రీడ్‌కు చెందిన ఒక మేల్‌, ఒక ఫిమేల్‌ కుక్క పిల్లలు ఇచ్చాడు.

అప్పుడు భానుమతిపై కోపంగా ఉన్నాను కాబట్టి కుక్క పిల్లలకు భానుమతి, రామకృష్ణ అని నేమ్స్ పెట్టాను.ఈ విషయాన్ని భానుమతికి చెప్పాను.

అది తెలుసుకున్న ఆమె కోపడలేదు ఫన్నీగానే తీసుకున్నారు” అని చెప్పుకొచ్చాడు.

Telugu Narinari, Pet Dogs, Rama Krishna, Tollywood-Movie

భానుమతి నుంచి కావలసిన వివరాలను ఎలాగైనా రాబట్టాలని మురారి చాలా ట్రై చేశాడు.చివరికి ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ, లండన్‌ నుంచి ఫోన్‌ చేస్తున్నానని నటిస్తూ ‘ఇండియాలో గ్రేట్‌ పర్సన్స్‌ అయిన సత్యజిత్‌రే, భానుమతి వంటి వారి గురించి బుక్ రాస్తున్నాం.మరుసటి రోజు మా కరస్పాండెంట్‌ మీ దగ్గరికి వచ్చి కావాల్సిన వివరాలను అడిగి తెలుసుకుంటారు.

’ అని ఇంగ్లీష్‌లో చెప్పాడు.అది నిజమే అనుకుంది భానుమతి( Bhanumathi ).దానికామె సంతోషించి కరస్పాండెంట్‌ వచ్చి కలవచ్చు అని తెలిపిందట.అయితే నెక్స్‌ట్‌ డే ఆ కరస్పాండెంట్‌గా ఆమె దగ్గరికి మురారినే వెళ్ళాడు.

కానీ మురారిని ఆమె గుర్తించింది.ఎందుకిలా చేశారు అని అడిగితే ‘ఏం చెయ్యమంటారండీ.చావగొడుతుంటే.’ అని అమాయకంగా అన్నాడట మురారి.దానికామె పగలబడి నవ్వుతూ ఉంటే ‘మీ మీద కోపంతో మా కుక్కకి భానుమతి అని పేరు పెట్టాను’ అని చెప్పాడట.దానికి కూడా ఆమె సరదాగా నవ్వుతూ ‘పోన్లెండి’ అని దాని గురించి వదిలేసిందట.

తరువాత తన పుస్తకానికి సంబంధించిన అన్ని వివరాలు ఆమె దగ్గర నుంచి కలెక్ట్ చేశాడు మురారి.ఆమె కొన్ని ఫోటోలు కూడా అతనికి ఇచ్చింది.

కొన్ని రోజులకు ఆమె మురారికి ఫోన్ చేస్తే భోజనం చేశారా అని అడిగిందట.అంటే ఆమె రామకృష్ణ అని పేరు పెట్టిన కుక్క గురించి అడిగింది.

దానికి కూడా మురారి సరదాగా సమాధానం చెప్పడం, ఆమె నవ్వుకోవడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube