గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్( Google CEO Sundar Pichai ) కంపెనీ మేనేజ్‌మెంట్‌లో పెను మార్పులను తీసుకొచ్చారు.తాజాగా గూగుల్ చీఫ్ టెక్నాలజిస్ట్‌గా భారత సంతతికి చెందిన ప్రభాకర్ రాఘవన్‌ను( Prabhakar Raghavan ) నియమించారు.
రాఘవన్ .గతంలో గూగుల్ సెర్చ్ అండ్ అడ్వర్టైజ్‌మెంట్స్ విభాగానికి నాయకత్వం వహించారు.12 ఏళ్ల పాటు గూగుల్‌లో పలు కీలక హోదాలలో పనిచేశారు.అక్టోబర్ 17న ఉద్యోగులకు కొత్త మార్పులపై సమాచారం అందించారు సుందర్ పిచాయ్.
రాఘవన్‌ను చీఫ్ టెక్నాలజిస్ట్‌గా నియమించడం కంపెనీలో పెను ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంటున్నారు.రాఘవన్‌తో సన్నిహితంగా పనిచేయడం ద్వారా కంపెనీ సాంకేతిక లక్ష్యాలను రూపొందించడంలో గూగుల్( Google ) సాంకేతిక నైపుణ్యం , సంస్కృతిని మెరుగుపరచడంలో దోహదపడుతుందని పిచాయ్ ఆకాంక్షించారు.
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) అన్ని రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న నేపథ్యంలో రాఘవన్‌తో కలిసి పనిచేయడం వల్ల మెరుగైన ఏఐ ఫ్లాట్‌ఫామ్‌ను సృష్టించవచ్చని పిచాయ్ అభిప్రాయపడ్డారు.అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ అనేది గూగుల్‌లో అత్యంత కీలక విభాగం.
ఏది ఏమైనా టెక్ దిగ్గజం గూగుల్‌లో మరో భారతీయుడు కీలకపాత్ర పోషించడం శుభ పరిణామం.
ఈయన ఒక్కరే కాదు.కొత్త టీమ్ మెంబర్స్‌పై గూగుల్ సీఈవో ఎన్నో ఆశలు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.గూగుల్ ఏఐ టూల్ జెమినీ యాప్‌లో పనిచేస్తున్న బృందం ఇకపై గూగుల్ డీప్ మైండ్‌లో( Google Deep Mind ) చేరుతుందని ఈ టీమ్‌కి డెమిస్ హస్సాబిస్ నేతృత్వం వహిస్తారని పిచాయ్ తెలిపారు.
అంతా బాగానే ఉంది కానీ గూగుల్ సెర్చ్ అండ్ అసిస్టెంట్ విభాగాలకు హెడ్ ఎవరు అనే దానిపై కార్పోరేట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది.సోషల్ మీడియా కథనాలను బట్టి ఈ బృందానికి నిక్ ఫాక్స్( Nick Fox ) నేతృత్వం వహించనున్నారు.యాడ్ హెడ్‌గానే కాకుండా కామర్స్, సెర్చ్, జియో విభాగాలకు కూడా ఆయన సారథ్యం వహించనున్నారు.గతంలో ఆర్‌సీఎస్ మెసేజింగ్, గూగుల్ ఎఫ్ఐ వంటి ప్రొడక్ట్స్‌ను తీసుకురావడంలో ఫాక్స్ కీలకపాత్ర పోషించారు.