ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Jani Master ) ఇటీవల తన అసిస్టెంట్ పట్ల లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈయన ప్రస్తుతం జైలులో ఉన్నారు.ఇలా పోలీసులు ఫిర్యాదు మేరకు తనని అరెస్టు చేసే రిమాండ్ కు పంపించారు.
ఇక జానీ మాస్టర్ కు బెయిల్ రావడం కూడా కష్టతరంగా మారింది.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మరొక మహిళ కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్( Anee Master ) ఈ విషయంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జానీ మాస్టర్ పట్ల లైంగిక ఆరోపణల కేసు నమోదయి అరెస్టు అయ్యారని విషయం తెలిసి ఒక్కసారిగా షాక్ అయ్యాను కొద్దిరోజుల పాటు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయానని తెలిపారు.జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి నేను కూడా ఆయన వద్ద రెండు సంవత్సరాల పాటు పని చేశాను.ఆయన ఎప్పుడూ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలిగించరని అనీ మాస్టర్ తెలిపారు.ఇక ఆయన నేరం చేశారా లేదా అన్నది కూడా రుజువు కాలేదు కానీ ఆయనకు వచ్చిన నేషనల్ అవార్డు( National Award ) వెనక్కి వెళ్లడం దారుణం.
ఆయన తప్పు చేశారని ఆయనకు వచ్చిన ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు వెనక్కి వెళ్ళింది రేపు చేయలేదని రుజువైతే పరిస్థితి ఏంటి అంటూ ఈమె ప్రశ్నించారు.ఇక అమ్మాయి వ్యవహారం కావడంతో ఇండస్ట్రీ నుంచి కూడా పెద్దగా ఆయనకు సపోర్ట్ లభించడం లేదని తెలిపారు.ఇలా జానీ మాస్టర్ గురించి అనీ మాస్టర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన కూడా పోలీస్ విచారణలో భాగంగా తనపై కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని వెల్లడించారు.
ఇండస్ట్రీలో కొంతమంది నా ఎదుగుదలను చూసి ఓర్వలేక నాపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయించి కుట్రకు పాల్పడ్డారని జానీ మాస్టర్ తెలిపారు.మరి ఈయనపై వచ్చిన ఈ ఆరోపణలలో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది.