ప్రస్తుత పోటీ ప్రపంచంలో గ్రూప్1( Group-1 ) సాధించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రభుత్వ ఉద్యోగాలు పొందడం కోసం గ్రూప్స్ పరీక్షలను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే.
ఈ పరీక్షలకు పోటీ ఊహించని స్థాయిలో ఉండగా ఆ పోటీలో విజేతలుగా నిలిచే వాళ్ల సంఖ్య తక్కువగా ఉంటుందనే సంగతి తెలిసిందే.అయితే ఒక యువతి మాత్రం ఎంతో కష్టపడి కలను నెరవేర్చుకుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని( Alluri Sitaramaraju District ) పెద బయలు ప్రాంతానికి చెందిన జీవన( Jeevana ) మొదట డాక్టర్ కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నా కొన్ని కారణాల వల్ల ఆ కల నెరవేరలేదు.ఆ కల కలగానే మిగిలిపోవడంతో ఆమె ప్రభుత్వ ఉద్యోగం సాధించడంపై ఫోకస్ పెట్టారు.
డిగ్రీ లాస్ట్ ఇయర్ చదువుతున్న సమయంలోనే జీవన గ్రూప్1 ప్రిపరేషన్ మొదలుపెట్టారు.
ప్రిలిమ్స్ లో సులువుగానే పాసైన జీవన మంచి మార్కులతో మెయిన్స్ కు ఎంపికయ్యారు.ఐటీడీఏ ఫ్రీగా అందించిన సివిల్స్ అండ్ గ్రూప్స్ కోచింగ్ కేంద్రంలో ఆమె శిక్షణ తీసుకున్నారు.మెయిన్స్ లో సైతం మంచి మార్కులు సాధించిన జీవన తొలి ప్రయత్నంలోనే డీఎస్పీగా( DSP ) ఎంపికై ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను సక్సెస్ అయ్యానని ఆమె చెబుతున్నారు.
23 సంవత్సరాల వయస్సులోనే లక్ష్యాలను సాధించిన ఈ యువతి నేటి తరంలో ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అక్కర్లేదు.జీవన సక్సెస్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.జీవన మంచి ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పవచ్చు.
డీఎస్పీ జాబ్ సాధించిన జీవన కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుని ఎంతోమందికి స్పూర్తిగా నిలిస్తే బాగుంటుందని చెప్పవచ్చు.జీవన సక్సెస్ ను నెటిజన్లు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.