సావిత్రి తెలుగు సినిమా పరిశ్రమలో మహానటి.ఆమెలా నటించే మరో నటీమణ తెలుగులో ఇంతకు ముందు రాలేదు.
ఇకపై రాదు అని చెప్పుకోవచ్చు.తన అసమాన నటనతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న నటీమణి తాను.
తెలుగులోని అగ్రహీరోలు అందరితోనూ కలిసి నటించింది.తమిళ, కన్నడ సినిమాల్లోనూ నటించి మెప్పించింది.
ఎంతో గొప్పగా బతికిన సావిత్రి.తన చివరి రోజుల్లో అత్యంత దారుణమైన పరిస్థితితులను ఎదుర్కొంది.
చివరకు మద్యానికి బానిసై ఒంటరిగా ఫీలై కుంగి చనిపోయింది.అయితే తన చివరి రోజుల్లో దయనీయ స్థితికి కారణం వాస్తు పాటించకపోవడం అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఇంతకీ ఈ మాటలు చెప్పింది ఎవరు? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మహానటి సావిత్రి అప్పట్లోనే తన ఇంట్లో స్విమ్మింగ్ పూల్ నిర్మించారట.
అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ తన భవనాకికే అందం వచ్చేలా చేసిందట.అయితే ఆ స్విమ్మింగ్ పూల్ ను ఆమె వాస్తుకు వ్యతిరేకంగా కట్టారని తన తల్లి జమున తనతో చెప్పినట్లు ఆమె కుమార్తె శ్రవంతిరావు వెల్లడించింది.
దీన్ని నిర్మించిన తర్వాత తన పతనం మొదలైనట్లు ఆమె చెప్పింది.ఆ తర్వాత అనేక సమస్యల్లో ఇరుక్కున్నట్లు తెలిపింది.
సినిమా రంగానికి చెందిన వ్యక్తులు న్యూమరాలజీతో పాటు వాస్తున్న ఎక్కువగా నమ్ముతారని చెప్పింది శ్రవంతి.ముహూర్తాలను కూడా బాగా పాటిస్తారని చెప్పింది.తన తల్లి మాత్రం వాస్తు, న్యూమరాలజీ నమ్మేది కాదని వెల్లడించింద ముహూర్తాలను మాత్రం బాగా నమ్ముతుందని చెప్పింది.అటు తన తల్లిదండ్రులు తనకు ఓకే ఒక్క విషయాన్ని చెప్పారని.
తప్పకుండా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవాలని అడిగారన్నారు.
వారి మాటలకు గౌరవించి.అలాగే చేసుకుంటానని చెప్పినట్లు శ్రవంతి తెలిపింది.అటు తన ఫ్రెండ్స్ మాత్రం తనను ఆట పట్టిస్తుంటారని చెప్పింది.
ఏ యాంగిల్ లో కూడా జమున కూతురులా కనిపించడం లేదని చెప్తారని వెల్లడించింది.సినిమా సెలబ్రిటీలు అంటే భువి నుంచి నేరుగా దిగిరారని చెప్పింది.
వాళ్లు కూడా సాధారణ మనుషులేనని చెప్పింది.