ట్రాన్స్‌జెండర్‌తో యువకుడి ప్రేమ వివాహం.. వీడియో వైరల్

సాధారణంగా మన భారతదేశంలో పెళ్లిళ్లు అంటే ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.ఇక పెళ్లి తంతు అంటే.

 Young Man's Love Marriage With Transgender Video Goes Viral , Telangana Man ,mar-TeluguStop.com

తెలుగు రాష్ట్రాలలో ఒక ప్రత్యేకమైన శైలి ఉంది.వధూవరుల ఇద్దరి మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు వారి జీవితం మొత్తం గుర్తుండి పోయేలాగా ఉంటాయి.

ప్రస్తుత రోజులలో మగవారు ఇద్దరు పెళ్లి చేసుకోవడం, ఆడవారు ఇద్దరు పెళ్లి చేసుకోవడం లాంటి సందర్భాలు కూడా మనం చాలానే చూసాము.ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

అలాంటి సంఘటన ఒకటి తాజాగా జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది.ఈ పెళ్లి వేడుకలో జరిగిన సంఘటన చూసి ఇప్పుడు అందరూ చర్చించుకున్తున్నారు.

ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.

తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా( Jagtial district ) గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ ( Srinivas )మ్యాడంపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ కరుణాంజలిని గత కొన్ని రోజులుగా ప్రేమిస్తున్నానని, ఆమెను వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.ఇక ఈ విషయాన్ని కరుణాంజలి ముందుగా ఒప్పుకోలేదు.

దాంతో శ్రీనివాస్ అంతటితో ఆగకుండా కరుణాంజలికి తన ప్రేమను వ్యక్తం చేయడంతో చివరికి కరుణాంజలి వివాహానికి ఒప్పుకొంది.అలాగే వీరిద్దరూ ప్రేమ విషయం గురించి పెద్దలకు చెప్పి ఒప్పించి చివరకు పెళ్లి పీటలు ఎక్కారు.వీరిద్దరి వివాహానికి పెద్ద ఎత్తున ట్రాన్స్‌జెండర్స్ కదలి వచ్చారు.

ప్రస్తుతం పెళ్ళికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతున్నాయి.ఈ సంఘటనతో ప్రేమకు ఎటువంటి లింగభేదం లేదని మరోసారి తేలిపోయింది.

ప్రేమకు లింగభేదం అడ్డురాదని ఈ యువ జంట రుజువు చేశారు.ఇదిలా ఉంటే.

ఇదేం విడ్డూరమని కొంతమంది ముక్కున వేలేసుకుంటుంటే. ఓ ట్రాన్స్ జెండర్( transgender ) ను పెళ్లి చేసుకొని ఆమెకు కొత్త జీవితం ఇచ్చిన శ్రీనివాస్‌ను మరికొంతమంది మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube