ఎన్టీఆర్ కి అక్కగా స్టార్ హీరోయిన్.. ఇదేం ప్లాన్ ప్రశాంత్?

ఎన్టీఆర్( Ntr ) ప్రస్తుతం దేవర( Devara ) సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.కొరటాల డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయి భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.

 Bhumika Plays Sister Role In Ntr Prashanth Neel Movie Details, Bhumika, Prashant-TeluguStop.com

ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఎన్టీఆర్ తదుపరి సినిమాలపై దృష్టి సారించారు.ఇక ఈయన త్వరలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్( Prashanth Neel ) సినిమా పనులలో బిజీ కాబోతున్నారు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక విషయంలో కూడా డైరెక్టర్ బిజీగా ఉన్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమా వచ్చేయడాది జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి.

Telugu Bhoomika, Bhumika, Ntr Bhumika, Ntr Sister Role, Prashanth Neel, Rukmini

ఇప్పటికే ఎంతో ఘనంగా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా కొత్త ఏడాదిలోనే షూటింగ్ జరుపుకోనుంది.ఇకపోతే  ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్( Rukmini Vasanth ) హీరోయిన్ గా నటిస్తున్నారని స్పెషల్ సాంగ్ లో సమంత( Samantha ) చిందులు వేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరొక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ సినిమాలో ఎన్టీఆర్ అక్క పాత్ర చాలా పవర్ ఫుల్  గా ఉండబోతుందని సమాచారం.

Telugu Bhoomika, Bhumika, Ntr Bhumika, Ntr Sister Role, Prashanth Neel, Rukmini

ఇలా ఎన్టీఆర్ కి అక్క పాత్రలో నటించడం కోసం ప్రశాంత్ స్టార్ హీరోయిన్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.మరి ఆ హీరోయిన్ ఎవరు అనే విషయానికి వస్తే.ఆమె మరెవరో కాదు స్టార్ హీరోయిన్ భూమిక( Bhumika ) అని తెలుస్తుంది.

ఈ సినిమాలో భూమిక ఎన్టీఆర్ కి అక్క పాత్రలో నటించబోతున్నారనే విషయం తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.ఇదెక్కడి ప్లాన్  ప్రశాంత్ ఒకప్పుడు ఎన్టీఆర్ భూమికతో కలిసి రొమాన్స్ చేశారు అలాంటిది ఇప్పుడు తనకి అక్కని చేసేసావే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

వీరిద్దరూ కలిసి సింహాద్రి సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించిన విషయం మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube