తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా అవతరిస్తున్నారు.ఇప్పుడు స్టార్ హీరోలు సైతం పాన్ ఇండియా ( Pan India)స్టార్లుగా అవతరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.
మరి ఇలాంటి క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ అయిన రాజమౌళి లాంటి దర్శకుడు సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ దర్శకుడి గా కొనసాగుతున్నాడు.
మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న సినిమా సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ఈయన బాటలో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు అందరు నడుస్తుండటం విశేషం.ఇక ఇప్పటికే సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు సూపర్ సక్సెస్ లను సాధించారు.
ఇక రీసెంట్ గా నాగ్ అశ్విన్, కొరటాల శివ( Nag Ashwin, Koratala Shiva ) లాంటి దర్శకులు కూడా పాన్ ఇండియా స్థాయికి ఎదిగారు.ఇక వీళ్ళ బాటలో మరి కొంతమంది ఇప్పుడు యంగ్ డైరెక్టర్లు కూడా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని చూస్తున్నారు.
గౌతమ్ తిన్ననూరి, శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకులు కూడా ఇప్పుడు పాన్ ఇండియా దర్శకులుగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా ఈ యంగ్ డైరెక్టర్లు పాన్ ఇండియాలో సత్తా చాటితే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది దర్శకులు పాన్ ఇండియాలో సక్సెస్ ఫుల్ దర్శకులుగా కొనసాగిన వారవుతారు… ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమానే టాప్ లెవెల్లో ఉందని చెప్పడానికి కూడా వీటన్నింటిని మనం ఆధారంగా తీసుకోవచ్చు…చూడాలి మరి ఈ డైరెక్టర్లు ఎలాంటి సక్సెస్ లు సాధిస్తారు అనేది…
.