తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇప్పటికే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటూ ముందుకు సాగుతుంటుంది.
ఇక ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో గుర్తింపును సంపాదించుకొని ముందుకు సాగాలంటే మాత్రం ఆ హీరోలకు భారీ సక్సెస్ అయితే ఉండాలి.ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు వరుస సక్సెస్ లను సాధిస్తుంటే మీడియం రేంజ్ హీరోలు మాత్రం సక్సెస్ లను సాధించడంలో వెనుకబడిపోతున్నారు.
ముఖ్యంగా గోపీచంద్( Gopichand ) లాంటి నటుడు మాత్రం ఎన్ని సినిమాలు చేసిన ఆ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండడంతో ఆయనకి నిరాశ ను కలిగిస్తున్నాయి…నిజానికి ఆయన చేసిన విశ్వం సినిమా( Viswam ) భారీ సక్సెస్ అవుతుందనే అంచనాలు పెట్టుకున్నాడు.కానీ ఆ సినిమా కూడా ఆయనకు సరైన సక్సెస్ ను ఇవ్వలేకపోయింది.మరి ఇక ఆయన ఎవరితో సినిమా చేసిన కూడా ఇదే రిపీట్ అవుతున్న సందర్భంలో నెక్స్ట్ ఆయన ఎవరితో సినిమా చేయాలనుకుంటున్నాడు.అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది…
ఇక శ్రీను వైట్ల( Srinu Vaitla ) లాంటి సీనియర్ దర్శకుడి తో సినిమా చేసిన కూడా గోపీచంద్ ఆ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలుపలేకపోయాడు.మరి కారణం ఏదైనా కూడా గోపీచంద్ కి ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తుందనే చెప్పాలి.మరి ఆయనకి గుడ్ టైమ్ నడిచి ఆయనకు ఒక మంచి సక్సెస్ ఎప్పుడు వస్తుందా అనే దాని మీదనే ఎప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ఎదురుచూస్తున్నారు.
అలాగే ఆయన అభిమానులు కూడా మా అభిమాన హీరోకి ఒక్క సక్సెస్ పడితే చూడాలని ఆరాటపడుతున్నారు…ఇక గోపీచంద్ ఇప్పుడు చేయబోయే సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది…
.