అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు డెమొక్రాట్ అభ్యర్ధి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.( Kamala Harris ) ఎన్నికల్లో కమలా హారిస్ పాల్గొంటారని కనీసం ఆమె కలలో కూడా ఊహించి ఉండరు.
అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) మరోసారి తానే బరిలో దిగుతానని చెప్పి.రెండు నెలల క్రితం వరకు ప్రచారంలో పాల్గొన్నారు.
అయితే వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలు, ప్రెసిడెన్షియల్ డిబేట్లో ట్రంప్ ముందు తేలిపోవడంతో డెమొక్రాట్ నేతల ఒత్తిడి మేరకు బైడెన్ రేసులో నుంచి అనూహ్యంగా తప్పుకుని ఆ ప్లేస్‌లోకి కమలా హారిస్ వచ్చారు.
కమల రాకతో ఎన్నికల వాతావరణం పూర్తిగా మారిపోయింది.అప్పటి వరకు ముందస్తు సర్వేలు, ఓపీనియన్ పోల్స్‌లో ట్రంప్( Trump ) ముందున్నారు.ఎప్పుడైతే కమలా హారిస్ ఎంట్రీ ఇచ్చారో నాటి నుంచి ముందస్తు అంచనాలతో పాటు నిధుల సేకరణలోనూ ఆమె పైచేయి సాధించారు.
మరో 15 రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు( US Presidential Elections ) జరగనుండగా.మెజారిటీ అమెరికన్లు కమలా హారిస్ వైపే ఉన్నట్లుగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ ఆదివారంతో కమల 60వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు.తన విషయ పరిజ్ఞానం , వాగ్థాటితో ట్రంప్‌పై ఆమె విరుచుకుపడుతున్నారు.
పుట్టినరోజు( Kamala Harris Birthday ) అయినప్పటికీ కమలా హారిస్ ప్రచారం నిర్వహిస్తారని అమెరికన్ మీడియా చెబుతోంది.
ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు వయసు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అక్టోబర్ 12న వైద్య నివేదికను విడుదల చేశారు కమలా హారిస్.ఆమెకు అద్భుతమైన ఆరోగ్యం ఉందని, అధ్యక్ష పదవిని నిర్వర్తించగలరని.సీజనల్ అలెర్జీలు, దద్దుర్లు వంటి చిన్న చిన్న అనారోగ్యాలు తప్పించి పెద్ద ఆరోగ్య సమస్యలు లేవని నివేదికలో పేర్కొన్నారు.
కమలా హారిస్ ప్రస్థానం:
కమలా హారిస్ 1964 అక్టోబరు 20న కాలిఫోర్నియాలో జన్మించారు.ఆమె తల్లిదండ్రులు శ్యామలా గోపాలన్, డొనాల్డ్ హారిస్. చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్ న్యూట్రిషన్ .కమల తాతయ్య పీవీ గోపాలన్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు.చిన్నతనంలో తరచూ చెన్నై రావడంతో కమలపై తాతగారి ప్రభావం పడింది.ఆమె 2014లో డగ్లస్‌ను పెళ్లి చేసుకున్నారు.
1986లో హోవార్డ్ వర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ అందుకున్న కమలా హారిస్.హేస్టింగ్ కాలేజ్ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.అనంతరం రాజకీయాలపై అభిరుచితో డెమోక్రటిక్ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగారు.2003లో శాన్ఫ్రాన్సిస్కో డిస్ట్రిక్ట్ అటార్నీగా ఎన్నికై.ఆ పదవి చేపట్టిన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా రికార్డుల్లోకెక్కారు.2011-17 మధ్య కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు.ఇక 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్ ఎన్నికై సరికొత్త చరిత్ర సృష్టించారు.