ఈరోజుల్లో సినిమా 3 గంటలు అంటే అంత పెద్ద కథానా.ఎందుకు అంత సేపు ఇలా ఎన్నో ప్రశ్నలొస్తాయి.
కానీ ఆరోజుల్లో ఒక సినిమా 3 గంటల 20 నిమిషాల ఉండి బ్లాక్ బస్టర్ కొట్టింది.అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యాక కూడా నటుల మధ్య వివాదాలు వచ్చాయట.
అంతేకాదు ఈ సినిమా వల్ల నేను నష్టపోయాను, అప్పులపాలయ్యాను అని నిర్మాత అనడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.అసలేం జరిగింది, ఆ సినిమా ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

అప్పుచేసి పప్పు కూడు సినిమా( Appuchesi Pappukudu Movie ) అప్పట్లో ఒక సంచలనం అనే చెప్పాలి.ఎక్కడం 3 గంటలకు పైగా ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముందు హిట్ కొట్టింది.ఈ సినిమా అందరికి నచ్చింది.ఈ సినిమాలో చాలా మంది నటులు నటించారు.రేలంగి,( Relangi ) గిరిజ,( Girija ) సావిత్రి,( Savitri ) ఎన్టీఆర్.( NTR ) సీఎస్ ఆర్.వంటి స్టార్స్ అందరు ఒకే సినిమాలో నటించారు.ఈ సినిమాలో టైటిల్స్ దగ్గర నుంచి మొత్తం 9 పాటలు ఉన్నాయి.టైం ఎక్కువ ఉన్న సెన్సార్ బోర్డు కథ బాగుండడంతో అభ్యన్తరం చెప్పలేదు.ఆ రోజుల్లోనే సినిమా టైమింగ్ ని మార్చి మరి విడుదల చేసారు.11 గంటలకు ప్రారంభం అవ్వాల్సిన షోలు 10 గంటలకే ప్రారంభం అయ్యాయి.సినిమా విడుదల అయ్యాక కథ బాగుండడంతో ప్రతి ఒక్కరికి నచ్చింది.
సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది.

అయితే సినిమా హిట్ అయినా నటుల మధ్య వివాదాలు చోటుచేసుకున్నాయి.ముక్కామల, సీఎస్ ఆర్, ఎన్టీఆర్-రేలంగి, సావిత్రి-గిరిజల మధ్య చిచ్చు మొదలైంది.ఈ సినిమా వల్ల తమరికి మాత్రమే గుర్తింపు వచ్చిందని చెప్పుకొచ్చారు.
దీంతో వివాదాలు పెరిగాయి.అయితే ఈ సినిమా సీఎస్ ఆర్ చుట్టూ తిరుగుతుంది.
అయితే ఆయన ఏకంగా నేను లేకపోతే ఈ సినిమానే లేదు అనడంతో మరింత వివాదంగా మారింది.చివరకు జోక్యం చేసుకున్న ముక్కామల( Mukkamala ) అందరూ కలిసి నటిస్తేనే సినిమా పూర్తయింది అన్నారు.
దీంతో వివాదం సర్దుకుంది అనుకున్నారు.కానీ ఆ తరువాత నిర్మాత నేను అప్పుల్లో మునిగాను అని చెప్పడంతో అందరు షాక్ అయ్యారు.