కోట్లు పెట్టి ఫేస్ డీ-ఏజింగ్ చేశారు.. మనీ వేస్ట్ అయ్యింది కానీ..?

ఈ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాల్లో టెక్నాలజీని బాగా వాడేస్తున్నారని స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు.కానీ టెక్నాలజీని సరిగా వాడుకో లేకపోతే మొత్తం సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ పడి వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ దెబ్బతినే అవకాశం ఉంది.

 Kanikaraj About Vikram Movie Deaging , Bollywood, Tollywood , Acharya , Chira-TeluguStop.com

టెక్నాలజీ బాగానే అభివృద్ధి చెందింది కానీ మనోళ్లు దాన్ని అతిగా వాడేస్తూ ప్రేక్షకులను డిసప్పాయింట్ చేస్తున్నారు.ఈ రోజుల్లో ఎక్కువ మంది డీ-ఏజింగ్ అనే ఒక విజువల్ ఎఫెక్ట్స్ టెక్నిక్ ఉపయోగిస్తున్నారు.

యాక్టర్ లేదా యాక్ట్రెస్ అప్పీరియన్స్ ను చాలా యంగ్‌గా కనిపించేలా చేయడానికి ఈ టెక్నిక్ యూజ్‌ అవుతుంది.ఈ సీజీఐ ట్రిక్కు హాలీవుడ్ డైరెక్టర్లు బాగా వాడుతుంటారు.

Telugu Acharya, Bollywood, Chiranjeevi, Kalki Ad, Kamal Haasan, Time, Tollywood,

ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్( Bollywood, Tollywood ) హీరోల సినిమాల్లో కూడా ఈ టెక్నిక్ ఉపయోగించడం జరుగుతోంది.ఉదాహరణకు యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ టీనేజ్ ఎపిసోడ్స్‌లో అతను కుర్రాడిలాగా కనిపించడం మనం గమనించవచ్చు.అది విజువల్ ఎఫెక్ట్ ఉపయోగించి చూపించినదే. సందీప్ రెడ్డి వంగా దీనిని బాగానే ఉపయోగించగలిగాడు.కానీ ఆచార్య సినిమా( Acharya )లో చిరంజీవిని యువకుడిలా చూపించడంలో మాత్రం కొరటాల శివ ఫెయిల్ అయ్యాడు.చిరంజీవి( Chiranjeevi ) ముఖం ఒక బొమ్మలాగా కనిపించింది.

అది చూడటానికి అస్సలు బాగోలేదు.మూవీ ఫెయిల్ కావడానికి ఇది కూడా ఒక కారణమే అని చెప్పుకోవచ్చు.

కల్కి 2898 AD( Kalki 2898 AD )లో అమితాబ్ బచ్చన్ యంగ్ ఫేస్ మాత్రం బాగానే కుదిరింది.

Telugu Acharya, Bollywood, Chiranjeevi, Kalki Ad, Kamal Haasan, Time, Tollywood,

ఇంకో సినిమాలో కూడా ఒక సీనియర్ హీరోని యంగ్ గా చూపించడానికి ఈ ట్రిక్ ఉపయోగించారు.దాన్ని సినిమాలో యాడ్ చేసి మొత్తం ఔట్ పుట్ చూడగా అది చాలా తేడాగా వచ్చిందని అర్థమైంది.ఆ మూవీ మరేదో కాదు బ్లాక్ బస్టర్ హిట్ అయిన విక్రమ్.

ఈ సినిమాలో కమల్ హాసన్( Kamal Haasan ) హీరోగా నటించాడు.ఇందులో “వన్స్‌ అపాన్ ఏ టైమ్‌ హీ ఇస్ ఏ ఘోస్ట్” అనే ఒక సీక్వెన్స్ వస్తుంది.

అందులో కమల్ హాసన్ యంగ్ లుక్ కోసం డీ-ఏజింగ్ ఫేస్ వాడారు.అయితే ఇదంతా చూసిన తరువాత బాగోలేదని వెంటనే లోకేష్ కనగరాజ్ ఆ సన్నివేశాలను మొత్తం తొలగించి ఓన్లీ ఫోటోలు ఉపయోగించి సినిమా రిలీజ్ చేశాడు.

దీనివల్ల సినిమాపై ఎలాంటి నెగటివ్ ఇంపాక్ట్ పడలేదు.కోట్లు వృధా అయ్యాయి కానీ సినిమా మాత్రం నెగిటివిటీని మూట కట్టుకోకుండా సక్సెస్ అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube