సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం బడా హీరోలే.. ఎస్వీ కృష్ణారెడ్డి ఫైర్..!

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకులు చాలా గొప్ప సినిమాలు తీస్తూ మాములు హీరోలను స్టార్ హీరోలుగా మార్చేవారు.జంధ్యాల, దాసరి నారాయణరావు, కె.

 Sv Krishna Reddy Fires On Tollywood Hero's , Sv Krishna Reddy , Subhalagnam ,-TeluguStop.com

విశ్వనాథ్, రాఘవేంద్రరావు, కె.వి.రెడ్డి, బాపు, విఠలాచార్య ఇలా చెప్పుకుంటూ పోతే మన తెలుగులో ఎంతో ప్రతిభావంతులైన దర్శకులు ఉన్నారు.వీళ్లు అద్భుతమైన సినిమాలను తీస్తూ హీరో రేంజ్‌ను కూడా బాగా పనిచేసేవారు.

వీళ్లు ఎలాంటి చిన్నపాటి నటులలైనా పెద్ద హీరోలుగా మార్చగల సత్తా ఉన్నవారు.ఈ దర్శకులు తాము రాసుకున్న స్టోరీని అస్సలు మార్చేవారు కాదు కావాలంటే హీరోలనే చేంజ్ చేసేవారు.

వీరి తరం ముగిసిన తర్వాత మళ్లీ అంతటి ప్రతిభావంతుడు అనిపించుకున్నాడు ఎస్వీ.కృష్ణారెడ్డి( SV Krishna Reddy ).ఈయన అలీ లాంటి కమెడియన్‌తో సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టు అందుకున్నాడు.

Telugu Organicmama, Heros, Subhalagnam, Tollywood, Tollywood Heros, Yamaleela-Mo

శుభలగ్నం, ఆహ్వానం, మావిచిగురు, బడ్జెట్ పద్మనాభం, ఉగాది వంటి సినిమాలతో శ్రీకాంత్, జగపతిబాబుల ఫేట్ కూడా మార్చేశాడు.ఈ సినిమాలు ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది.ఇవి ఎప్పుడు చూసినా చాలా ఫ్రెష్ గానే అనిపిస్తాయి.

ఈయన సినిమాలో హెల్తీ కామెడీకి కొదవ ఉండదు.అవి చూసి ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవచ్చు.2007 తర్వాత ఎస్.వీ కృష్ణారెడ్డి నుంచి ఒక్క హిట్ సినిమా కూడా రాలేదు.2007 తర్వాత ఇన్‌యాక్టీవ్ అయ్యారు.అడపాదడపా సినిమాలు తీసినా అవి హిట్ కాలేదు.

చివరిసారిగా 2023లో “ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు( Organic Mama Hybrid Alludu)” మూవీ తీశాడు.ఇది మామూలుగానే ఆడింది.

ఇప్పుడు మరో సినిమా చేయడానికి ఆయన రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

Telugu Organicmama, Heros, Subhalagnam, Tollywood, Tollywood Heros, Yamaleela-Mo

ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఎస్వీ కృష్ణారెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.అందులో ఆయన మాట్లాడుతూ బడా హీరోల వల్లే చాలా సినిమాలు ఫెయిల్ అవుతున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశాడు.సాధారణంగా స్టార్ హీరోలు తమ ఇమేజ్ కి తగినట్లు సినిమా ఉండాలంటూ కథలో వేలు పడుతుంటారు.

డైరెక్టర్ ఒక కథను చక్కగా రాసుకున్నప్పుడు మధ్యలో ఇలాంటి హీరో ఎలివేషన్స్ యాడ్ చేస్తే మూవీ పాడయ్యే అవకాశం ఉంది.ఒక్కోసారి స్టోరీ కూడా మార్చాల్సి రావచ్చు.

దీనివల్ల దర్శకుడు రాసుకున్న కథ మొత్తం మారిపోతుంది.ఎటూ కాకుండా పోతుంది.

అలా మార్చేసిన స్టోరీతో సినిమా వస్తే అది ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కువ అని ఎస్వీ కృష్ణారెడ్డి అభిప్రాయపడ్డాడు.ఒక పెద్ద సినిమా ఫెయిల్ అయిందంటే దానికి కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు ఆ సినిమా హీరో కూడా కారణమే అని అతడు కొండ బద్దలు కొట్టాడు.ఎస్వీ కృష్ణారెడ్డి ఎక్కువగా చిన్న హీరోలతోనే సినిమాలు చేశాడు.పెద్ద హీరోలు కథలో వేలు పెడతారనే వారితో ఎక్కువగా సినిమాలు చేయలేదని ఆయన స్పష్టం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube