ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించడం సులువైన విషయం కాదు.ప్రభుత్వ ఉద్యోగం అయినా ప్రైవేట్ ఉద్యోగం అయినా ఎంతో కష్టపడితే మాత్రమే ఉద్యోగం సాధించే అవకాశాలు అయితే ఉంటాయి.
హర్యానా( Haryana)కు చెందిన రాజీవ్ భాస్కర్( Rajiv Bhaskar ) తాను చేస్తున్న జాబ్ కు రాజీనామా చేసి సొంత కాళ్లపై నిలబడాలని అనుకున్నారు.రైతుగా ఊహించని స్థాయిలో లాభాన్ని సొంతం చేసుకుని వార్తల్లో నిలిచారు.
ఒక సీడ్స్ కంపెనీలో సేల్స్ అండ్ మార్కెటింగ్ టీంలో సభ్యుడిగా పని చేసిన భాస్కర్ తాను బీఎస్సీ అగ్రికల్చర్ చదివినా వ్యవసాయం గురించి చాలా విషయాలు తెలియక రైతులను అడిగి తెలుసుకునేవాడినని చెప్పుకొచ్చారు.2017 సంవత్సరంలో భాస్కర్ వ్యవసాయ రంగంలో కెరీర్ ను మొదలుపెట్టారు.ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సేంద్రీయ పద్దతి( Organic method)లో జామకాయల సాగు చేశారు.
పంజాబ్( Punjab ) లోని రూప్ నగర్ లో భాస్కర్ 55 ఎకరాల భూమిని అద్దెకు తీసుకున్నారు.25 ఎకరాల్లో థాయి రకం జామపండ్లను సాగు చేశారు .మొదట ఐదు రకాల భూమిలో సాగు చేసిన సమయంలోనే 20 లక్షల రూపాయల లాభం సాధించ్న భాస్కర్ ఇప్పుడు ఏకంగా కోట్ల రూపాయల లాభాన్ని సొంతం చేసుకుంటున్నారు.సేంద్రీయ పద్దతి వల్లే భారీ లాభాలు వచ్చాయని ఆయన చెబుతున్నారు.తను కళ్లు చెదిరే లాభాలను సాధించడంతో పాటు ఎంతోమందికి ఉపాధి చూపించడం ద్వారా భాస్కర్ ప్రశంసలు అందుకుంటున్నారు.
భాస్కర్ సక్సెస్ ను ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ఈ తరంలో భాస్కర్ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నారు.భాస్కర్ తన ప్రతిభ, లౌక్యం, తెలివితేటలతో ఈ స్థాయికి చేరుకున్నారని చెప్పవచ్చు.వ్యవసాయం చేసి కూడా భారీ లాభాలను సొంతం చేసుకోవచ్చని ఇతని సక్సెస్ స్టోరీ ద్వారా అర్థమవుతుంది.
ఎకరాకు ఏకంగా 6 లక్షల రూపాయల వరకు నాకు లాభం వస్తోందని రాజీవ్ భాస్కర్ చెప్పుకొచ్చారు.