ప్రస్తుత రోజులలో కొంత మంది ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి సీపీఆర్( CPR ) చేసి ప్రాణాపయ నుంచి బయటపడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అందుకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
సాధారణంగా మనలో చాలామందికి పాములు( Snakes ) అంటే చాలా భయం.వాటిని చూస్తేనే భయంతో వణికి అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటారు.ఇక మరికొందరు అయితే ఆ పాములను చంపేయడం లేదా సురక్షిత ప్రాంతాలకు పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే, తాజాగా ఒక వ్యక్తి పామును పట్టుకొని సీపీఆర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చెక్కర్లు కొడుతుంది.
సాధారణంగా ఎవరైనా మనుషులు లేవలేని స్థితిలో ఉంటే సీపీఆర్ చేసి బతికించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.కానీ మొదటిసారిగా పాముకు సీపీఆర్ చేసి ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి లోను చేస్తున్నాడు.సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.గుజరాత్ వడోదరలో( Vadodara ) ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాముకు సీపీఆర్ చేసి ప్రాణాలను కాపాడాడు.వడోదరలో చౌరస్తా దగ్గర రోడ్డు పక్కన స్థితిలో ఉన్న పామును గుర్తించి కొందరు వెంటనే జంతు సంరక్ష అధికారులకు సమాచారం అందజేశారు.
వెంటనే జంతువుల సంరక్షక అధికారులు అక్కడికి చేరుకొని సీఆర్పీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో యశ్ తాడ్వి( Yash Tadvi ) అనే యువకుడు ఆ పాము పిల్లలు చేతిలో తీసుకొని దానికి ప్రాణాలు పోలేదని నిర్ధారించుకున్న తర్వాత అతను వెంటనే పాముని నోటితో శ్వాస అందిస్తూ సీపీఆర్ చేశాడు.అనంతరం కొన్ని నిమిషాల్లోనే ఆ పాములో చలనం వచ్చింది.
ఈ వీడియోను చూసిన కొంతమంది నెటిజన్స్ ఆ యువకుడి ధైర్యాన్ని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.