తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది.ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ సక్సెస్ ఫుల్ హీరోలుగా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు.
ఇక ఇప్పటికే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఇప్పుడు బాలయ్య బాబు కొడుకు అయిన మోక్షజ్ఞ( Mokshagna Teja ) కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇదే సమయంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా వస్తున్న సినిమా కోసం బాలయ్య భారీ కసరత్తులను చేస్తున్నాడు.అయితే ఈ సినిమాను తొందరలోనే సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందనే దానిమీద సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మోక్షజ్ఞ తల్లిగా బాలయ్య ( Balakrishna )బాబుతో ఆడి పాడిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ నటించబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…

మరి ఆ పాత్రలో నటించే నటి ఎవరు అనే దాని మీదనే ఇప్పుడు ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే విజయశాంతి ( Vijayashanti )మోక్షజ్ఞ తల్లిగా నటించే అవకాశం ఉన్నట్టుగా సినిమా మేకర్స్ అయితే వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.మరి మొత్తానికైతే విజయశాంతి ఆ పాత్రని ఒప్పుకొని సినిమా చేయడానికి రెడీ అయిందంటే మాత్రం ఆ పాత్రకి ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉంటుందని వాళ్ళ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది.
మరి మొత్తానికైతే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్న నేపధ్యంలో ఇక మోక్షజ్ఞ కూడా బాలయ్య బాబు బాటలోనే నడిచి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నమైతే చేస్తున్నాడు…
.







