చెర్రీ, నాగ్, వెంకీ కాంబోలో భారీ మల్టీస్టారర్.. కొద్దిలో మిస్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది.ఇటీవల కాలంలో వెంకటేష్, మహేష్ బాబు కలిసి చేసిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

 Tollywood Multi Starrer Missed ,ram Charan, Venkatesh, Nagarjuna ,seethamma Vak-TeluguStop.com

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమాలూ భారీ హిట్స్ సాధించాయి.చిరంజీవి తరంలో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ తగ్గింది.

చిన్న హీరోలు, మీడియం రేంజ్‌ల హీరోల కాంబోలో మల్టీస్టారర్ సినిమాలు వచ్చేవి కానీ వాటి వల్ల పెద్దగా బిజినెస్ జరగలేదు.

Telugu Krishna Vamsi, Mahesh Babu, Nagarjuna, Prakash Raj, Ram Charan, Srikanth,

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు( Seethamma Vakitlo Sirimalle Chettu ) తర్వాత మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్ అనేది మొదలైంది.ఈ ట్రెండ్ వల్ల టాలీవుడ్ మార్కెట్ కూడా బాగా పెరిగింది.అయితే “సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు” కంటే ఎక్కువ బడ్జెట్ తో ఓ భారీ మల్టీస్టారర్ తెలుగులో రావాల్సి ఉంది.

ఇందులో రామ్ చరణ్, వెంకటేష్, నాగార్జునలను నటింప చేయాలనుకున్నారు.కానీ తర్వాత వెంకటేష్, నాగార్జునలను ఈ సినిమా నుంచి తప్పించారు.ఆ మూవీ మరేదో కాదు, ‘గోవిందుడు అందరివాడేలే’.రామ్ చరణ్, కృష్ణ వంశీ కలిసి చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్‌తో సరిపెట్టుకుంది.

Telugu Krishna Vamsi, Mahesh Babu, Nagarjuna, Prakash Raj, Ram Charan, Srikanth,

ఇందులో శ్రీకాంత్ పాత్రను మొదట విక్టరీ వెంకటేష్ ( Venkatesh )కి ఇచ్చారు, చెర్రీ తండ్రి పాత్రను అక్కినేని నాగార్జునకు ఆఫర్ చేశారు.అలాగే సినిమాలో అత్యంత కీలకమైన ప్రకాష్ రాజ్ క్యారక్టర్ కోసం సూపర్ స్టార్ కృష్ణని అనుకున్నారు.మొత్తం మీద ఈ మూవీని భారీ మల్టీస్టారర్ గా కృష్ణ వంశీ తీద్దామని భావించాడు.కానీ స్క్రిప్ట్ రెడీ అయ్యాక వెంకటేష్, నాగార్జున, సూపర్ స్టార్ కృష్ణ పోషించగలిగేంత గొప్ప పాత్రలు ఇందులో లేవని అతనికి అర్థం అయింది.

ఈ మూవీలో శ్రీకాంత్( Srikanth ) ఓ జులాయి, తాగుబోతుగా కనిపించాడు.ఇలాంటి క్యారక్టర్ లో వెంకటేష్ చేసే అవకాశం లేదు.ఆయన స్థాయిని తగ్గించినట్లు అవుతుందని కృష్ణవంశీ భావించి అదే విషయం వెంకటేష్ కి చెప్పి ఆ పాత్రను ఆయనకు ఇవ్వలేదు.ఇక రామ్ చరణ్ తండ్రి క్యారక్టర్ కు కూడా పెద్దగా ఇంపార్టెన్స్ లేదు.

అందుకే నాగార్జునను తీసుకోవాల్సిన అవసరం లేదని కృష్ణవంశీ భావించాడు.ప్రకాష్ రాజ్‌ పాత్ర చాలా ముఖ్యమైనదే.

దానికి వెయిట్ ఉంది కానీ అదొక ఫుల్ లెన్త్ రోల్.సూపర్ స్టార్ కృష్ణ అప్పటికే వయోభారంతో బాధపడుతున్నారు.

దానిని పోషించే పరిస్థితి లేదు కాబట్టి చివరికి సూపర్ స్టార్ కృష్ణని కూడా తీసుకోలేదు.ఒకవేళ ఈ పాత్రలు బాగుండి ఈ ముగ్గురూ దిగ్గజ నటులు నటించినట్లయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయి ఉండేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube