దేవర మూవీ( Devara ) ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచింది.ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏకంగా 520 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఎంతగానో నచ్చిన సినిమాలలో దేవర ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే ఈ సినిమా ఖాతాలో అరుదైన రికార్డ్ చేరింది.
కరోనా తర్వాత వరుసగా 18 రోజుల పాటు కోటి రూపాయలు, అంతకంటే ఎక్కువమొత్తం షేర్ కలెక్షన్లను సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచింది.
దేవర సినిమాకు ఇప్పటివరకు ఏకంగా 50 కోట్ల రూపాయలకు పైగా లాభాలు వచ్చాయి.దేవర సినిమా సాధించిన కలెక్షన్లు రికార్డ్ స్థాయిలో లాభాలను అందుకోవడం అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ఇకపై రెస్ట్ లేకుండా వరుస సినిమాల షూటింగ్ లతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది.
దేవర మూవీ రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ రికార్డులను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. దేవర1 సక్సెస్ సాధించిన నేపథ్యంలో దేవర సీక్వెల్ ఎలా ఉండబోతుందనే చర్చ సోషల్ మీడియా వేదికగా జోరుగా జరుగుతోంది.దేవర సీక్వెల్ లో దేవర పాత్ర కూడా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.దేవర సినిమా ఇప్పటికీ రెంటల్ బేసిస్ పై రన్ అవుతోందని ఈ సినిమా బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు.
దేవర సీక్వెల్ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని దేవర సీక్వెల్ కూడా కచ్చితంగా హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.దేవర మూవీ ఫుల్ రన్ లో మరిన్ని క్రేజీ రికార్డులను సొంతం చేసుకునే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.