చాలా మంది పెద్దలు వారి కుటుంబ సభ్యులను చక్కెర బదులు బెల్లం ఉపయోగించాలని చెబుతుంటారు.దీనికి కారణం లేకపోలేదు… బెల్లాన్ని కొద్ది మొత్తంలో ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా అనేక లాభాలు మనకు లభిస్తాయి.
ఇక బెల్లం ఎలా శరీరానికి ఉపయోగ పడుతుందో అన్న విషయానికి వస్తే… బెల్లాన్ని రోజుకు 30 గ్రాముల తీసుకుంటే అది మన రక్తం శుద్ధి చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.వీటితో పాటు శరీరానికి అధిక శాతం ఎక్కువగా పొటాషియం, సోడియం లభిస్తాయి.
బెల్లం తినడం ద్వారా ముఖ్యంగా లావు తగ్గాలనుకునేవారికి బాగా ఉపయోగపడుతుంది.దీనికి గల కారణం బెల్లం శరీరంలోని మెటబాలిజంను ఓ క్రమపద్ధతిలో ఉంచడానికి సహకరిస్తుంది.కాబట్టి బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది.అంతేకాదు బెల్లం తీసుకోవడం ద్వారా అత్యధిక మొత్తంలో పొటాషియం శరీరానికి అందుతుంది.
వీటివలన ఎవరైనా కీళ్లనొప్పులు, అరికాలి మంటతో బాధపడే వాళ్ళు ప్రతి రోజు బెల్లం తీసుకొవడం ద్వారా వాటి తీవ్రత కొద్దీ మేర తగ్గుతుంది.బెల్లం తో పాటు అల్లం కలుపుకుని తీసుకుంటే మరింత ఉపశమనం లభిస్తుంది.
అలాగే ఎవరికైనా ఆస్తమా కలిగి ఉంటే వారు బెల్లం తో పాటు నువ్వులను కలిపి తింటే వారికి చక్కటి ఫలితాన్ని పొందవచ్చు.ముఖ్యంగా బెల్లంలో చక్కెర కంటే చాలా తక్కువ కేలరీలు ఉంటాయి.
తక్కువ కేలరీలు ఉండడం ద్వారా మన శరీరం లోకి అధిక క్యాలరీలు చేరవు.తద్వారా మనకి అధిక బరువు తగ్గించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.రాత్రి పూట భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ చాలా సులభంగా మారుతుంది.దీని ద్వారా మన జీర్ణక్రియలో ఎంజైమ్లను యాక్టివేట్ చేయగలుగుతుంది.
ఇలా అవ్వడం వల్ల మన శరీరానికి గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం లాంటి సమస్యలు కూడా దరిచేరవు.