కెనడాలో( Canada ) ఓ వ్యక్తి రెచ్చిపోయాడు.భారతీయ వలసదారులపై( Indian Immigrants ) జాత్యహంకార కామెంట్స్ చేసి వారిని దారుణంగా అవమానించాడు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.కొందరు స్టూడెంట్స్( Students ) లగేజీతో రోడ్డుపై టాక్సీ కోసం వెయిట్ చేస్తుంటే, ఆ వ్యక్తి వాళ్లని వీడియో తీస్తూ “రెఫ్యూజీలు”( Refugees ) అంటూ హేళన చేశాడు.
ప్రధాని జస్టిన్ ట్రూడో విధానాలే దీనికి కారణమని నిందించాడు.
RTN కెనడా X (ట్విట్టర్)లో షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తోంది.ఆ వ్యక్తి అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్న గ్రూప్ చుట్టూ తిరుగుతూ, వీడియో తీస్తూ దారుణంగా మాట్లాడాడు.“ఇండియా నుండి వచ్చిన రెఫ్యూజీలు ఇక్కడ ఉన్నారు.ఇది ట్రూడో పాలన.ఎక్కడ చూసినా ఇండియన్సే,” అంటూ లగేజీ చూపిస్తూ కామెంట్ చేశాడు.పదే పదే వాళ్లని “రెఫ్యూజీలు” అంటూ కెనడాలో పెరుగుతున్న ఇండియన్ పాపులేషన్‌పై విమర్శలు చేశాడు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.జాత్యహంకార వ్యాఖ్యలపై( Racist Comments ) నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.మల్టీకల్చరల్ కెనడాలో ఇలాంటివి జరగడం షాకింగ్‌గా ఉందని అంటున్నారు.
ట్రూడో ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ పాలసీలపై విమర్శలు వస్తున్నాయి.ఈ ఘటన కెనడాలోని ఇండియన్ కమ్యూనిటీలో టెన్షన్ పెంచుతోంది.

ఆ వ్యక్తి ప్రవర్తనతో ఆ విద్యార్థుల గుంపు చాలా ఇబ్బందిగా ఫీలయ్యింది.కొందరు అతని వైపు చూడకుండా ఉండగా, ఒక స్టూడెంట్ మాత్రం నవ్వుతూ మర్యాదగా ఉన్నాడు.అయినా ఆ వ్యక్తి వాళ్ళని గేలి చేస్తూ, “కెనడాలో తెల్లవాళ్లు ఎక్కడ ఉన్నారు?” అని అడిగాడు.RTN కెనడా అకౌంట్ అదే వ్యక్తి ఫుడ్ కోర్టులో ఒక ఇండియన్ కపుల్‌ని టార్గెట్ చేసిన మరో వీడియోను కూడా షేర్ చేసింది.
వాళ్లు తింటుండగా వీడియో తీసి వాళ్లని అవమానించాడు.తాను కుర్చీలు జరపమని అడిగితే వాళ్ళు ఒప్పుకోలేదని వీడియో క్యాప్షన్‌లో పేర్కొన్నాడు.
ఈ ఘటనతో నెటిజన్లు భగ్గుమంటున్నారు.చాలా మంది ఈ జాత్యహంకారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.వాళ్లు రెఫ్యూజీలు కాదని, సరైన వీసాలతో వచ్చిన స్టూడెంట్స్ అయి ఉంటారని అంటున్నారు.“ఇమ్మిగ్రెంట్స్ ఇక్కడ జీవితాలు నిర్మించుకోవడం వల్ల మీకు ఎలాంటి నష్టం లేదు” అని ఒకరు కామెంట్ చేశారు.“ఇలాంటి రేసిజం అవసరం లేదు.వాళ్లు మంచి జీవితం కోసం ప్రయత్నిస్తున్నారు అంతే” అని మరొకరు అన్నారు.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.







