నీటి కోసం వెళ్లిన సింహానికి మొసలి ఊహించని షాక్.. వీడియో వైరల్..

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వేటగాళ్లలో మొసళ్లు( Crocodiles ) ముందు వరుసలో ఉంటాయి.సింహాలంత క్రూరమైన జీవులు ఇవి.

 Lion Narrowly Escapes Crocodile Attack Video Viral Details, Lion, Crocodile, Ani-TeluguStop.com

వాటి బలమైన దవడలు, నీటిలో చాటుగా కదిలే నైపుణ్యంతో ఇతర జీవులను ఇట్టే చంపేస్తాయి.ఒక్కసారి మొసలి పట్టుకుంటే ఇక అంతే సంగతులు, తప్పించుకోవడం దాదాపు అసాధ్యం.

అలాంటి మొసలికి, సింహానికి మధ్య జరిగిన ఊహించని పోరాటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యూట్యూబ్ ఛానల్ “లేటెస్ట్ సైటింగ్స్”లో( Latest Sightings ) అప్‌లోడ్ చేసిన ఈ వీడియో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

సింహం ( Lion ) నది ఒడ్డుకు రావడం, నీటి అడుగున కాపు కాసి ఉన్న మొసలి దానిపై ఒక్కసారిగా దాడి చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.సింహం నీటిలోకి అడుగు పెట్టగానే, మొసలి మెరుపు వేగంతో దాని కాలును పట్టుకుని నీటిలోకి లాగడానికి విశ్వప్రయత్నం చేస్తుంది.

దీంతో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.

Telugu Animals, Crocodile, Escape, Latest, Nature, River Attack, Wildlife-Latest

అయితే, ఆ తర్వాత జరిగిన సీన్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.సింహం మొసలితో తీవ్రంగా పోరాడి దాని పట్టు నుంచి విడిపించుకుంది.మొసలి ఎంత ప్రయత్నించినా సింహాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోలేకపోయింది.

చివరికి విసిగిపోయి వదిలేసింది.సాధారణంగా మొసలి తన పట్టున ఉన్న జంతువును అంత సులువుగా వదలదు.

అందుకే ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. “మొసలి పట్టు నుండి ఏ జంతువైనా తప్పించుకోవడం నేను ఎప్పుడూ చూడలేదు” అని ఒక యూజర్ కామెంట్ చేయడం విశేషం.

Telugu Animals, Crocodile, Escape, Latest, Nature, River Attack, Wildlife-Latest

మొసళ్లను ‘నదుల రారాజులు’ అని పిలుస్తారు.వాటి వేట నైపుణ్యాలు అంతటి శక్తివంతమైనవి.కానీ, ఈ వీడియోతో వాటి అంచనా ఒక్కోసారి తప్పుతుందనే విషయం స్పష్టమైంది.ఈ ఘటన అడవిలో( Forest ) జరిగే అనూహ్య, థ్రిల్లింగ్ పోరాటాలకు ఒక ఉదాహరణ.

సింహం, మొసలి మధ్య జరిగిన ఈ పోరు ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.అత్యంత బలం కలిగిన సింహం కూడా మొసలి దాడికి బలవుతుంది అనుకుంటే, చివరకు సింహం తన ధైర్య సాహసాలతో మొసలిని ఓడించడం నిజంగా గగుర్పాటు కలిగిస్తుంది.ఈ వీడియో వన్యప్రాణుల ప్రపంచంలో జరిగే ఆశ్చర్యకరమైన సంఘటనలకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జామ్పుల్ అని చెప్పుకోవచ్చు.

https://x.com/gupchup_news/status/1874998783010070753?t=vj7MKAMpH6VDptfVzPZ6Kg&s=19 ఈ లింకు పై క్లిక్ చేసి వీడియో చూడొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube