బన్నీ కోసం సైకిల్ పై 1600 కిలోమీటర్లు.. ఈ అభిమానానికి ఫిదా కావాల్సిందే!

ఇండియాలో సెలబ్రిటీలకు క్రికెటర్లకు ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ క్రేజ్ కానీ మరెవ్వరికీ ఉండదు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.మరి ముఖ్యంగా హీరోలకు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది అని చెప్పవచ్చు.

 Uttar Pradesh Fan Met Allu Arjun, Uttar Pradesh, Allu Arjun, Fan, Tollywood, Ico-TeluguStop.com

ఇక హీరోలపై ఉన్న అభిమానంతో చాలామంది పిచ్చిపిచ్చి పనులు కూడా చేస్తూ ఉంటారు.వారి పేర్లు లేదా ఫోటోలు టాటూలు వేయించుకోవడం, లేదంటే వారి ఫోటోలు పెట్టి రక్తాలు చిందించడం లాంటివి చేస్తుంటారు.

ఈ మధ్య కాలంలో చాలామంది అభిమానులు హీరోలపై ఉన్న అభిమానంతో దూర ప్రయాణాలు చేయడం లేదంటే కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం, లేదంటే సైకిల్ పై ప్రయాణం చేయడం లాంటివి చేస్తున్నారు.

Telugu Allu Arjun, Cycle, Diehard Fan, Icon, Pushpa, Tollywood, Uttar Pradesh-Mo

తాజాగా కూడా ఒక అభిమాని టాలీవుడ్ స్టార్ హీరో కోసం ఏకంగా 1600 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేసాడు.ఇంతకీ ఆ హీరో ఎవరు? ఆ అభిమాని ఎవరు? అన్న వివరాల్లోకి వెళితే.తాజాగా అల్లు అర్జున్‌( Allu Arjun) అభిమాని మోహిత్‌ ఒక పెద్ద సాహసం చేశాడు.

ఉత్తరప్రదేశ్‌ ( Uttar Pradesh )నుంచి సైకిల్‌ తొక్కుకుంటూ హైదరాబాద్‌ వచ్చాడు.తన అభిమాన హీరో అల్లు అర్జున్‌ను కలిసేందుకు ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌ నుంచి దాదాపు 1600 కి.మీ.సైకిల్‌ పై ప్రయాణించాడు మోహిత్‌.మొదటి నుంచీ బన్నీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువ.ఇతర రాష్ట్రాలవారు కూడా అతన్ని ఇష్టపడతారు.పుష్ప తర్వాత ఆ క్రేజ్‌ మరింత పెరిగిందని చెప్పాలి.పుష్ప చిత్రంలో అల్లు అర్జున్‌ పెర్‌ఫార్మెన్స్‌, అతని మేనరిజం, చెప్పిన డైలాగ్స్‌ బాగా పాపులర్‌ అయ్యాయి.

ఈ ఒక్క సినిమాతోనే బన్నీ ఫ్యాన్స్‌ విపరీతంగా పెరిగిపోయారు.

Telugu Allu Arjun, Cycle, Diehard Fan, Icon, Pushpa, Tollywood, Uttar Pradesh-Mo

తనను కలిసేందుకు కొన్ని వందల కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుకుంటూ వచ్చిన మోహిత్‌ ని చూసి బన్నీ ఎమోషనల్‌ అయ్యారు.ఎంతో ఆప్యాయంగా అతన్ని పలకరించి అతని వివరాలన్నీ తెలుసుకున్నారు.అలాగే కుటుంబ సభ్యుల యోగక్షేమాల గురించి కూడా ఆరా తీశారు.పుష్ప2 ( Pushpa 2 )ప్రమోషన్స్‌కి యు.పి.వచ్చినట్టయితే తప్పకుండా కలుస్తానని అతనికి హామీ ఇచ్చారు బన్నీ.అతనికి ఒక మొక్కను బహుమానంగా అందించారు.అతని కోసం విందు ఏర్పాటు చేసారు.ఆ తర్వాత అతన్ని బస్సులో పంపించే ఏర్పాటు చేయమని, అలాగే కొంత డబ్బు కూడా ఇవ్వమని తన స్టాఫ్‌కి సూచించారట.

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ అరుదైన విషయాన్ని తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్‌ ఎంతో మురిసిపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube