కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ( Vijay Antony ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం విజయ్ ఆంటోనీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతున్నారు.
అందులో భాగంగానే ఇటీవలే బిచ్చగాడు 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.మొదట మ్యూజిక్ డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ ఆంటోని ఆ తర్వాత హీరోగా మారి పలు సినిమాలలో నటించి ఇప్పుడు స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే విజయ్ భార్య ఫాతిమా ఆంటోని( Fatima Antony ) కూడా నిర్మాతగా పలు చిత్రాలు తెరకెక్కిస్తోంది.అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్ట్ లతో నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది.తాజాగా, ఫాతిమా ట్విట్టర్ వేదికగా ఒక సంచలన ట్వీట్ చేసింది.ఆ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ మేరకు పోస్ట్ చేస్తూ.మీతో బాగానే ఉంటూ మీ వెనక పెద్ద పెద్ద గోతులు తవ్వే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి.
అది కొత్త వాళ్లైనా మీ స్నేహితులైనా అప్పుడప్పుడు కలిసే వ్యక్తులే అయినా లేదా మీ కుటుంబ సభ్యులైనా సరే చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.ఊరికే చెబుతున్నాను అని రాసుకొచ్చింది.
ప్రజెంట్ ఫాతిమా ట్వీట్ వైరల్ అవుతుండగా నెటిజన్లు ఎవరిని ఉద్దేశించి చేసిందని చర్చించుకుంటున్నారు.ప్రస్తుతం అందుకు సంబంధించి ట్వీట్ వైరల్ గా మారింది.కాగా, ఇటీవల విజయ్ పెద్ద కూతురు మీరా ఒత్తిడి ( Vijay Antony Daughter )వల్ల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే.దీంతో ఫాతిమా, విజయ్ కొద్ది కాలం పాటు కన్నీరు మున్నీరు అయ్యారు.
ఇప్పుడిప్పుడే కూతురిని మర్చిపోతూ పనిలో బిజీ అవుతున్నారు.