డార్క్ అండర్ ఆర్మ్స్( Dark underarms ).మనలో చాలా మందిని కలవర పెట్టే సమస్యల్లో ఇది ఒకటి.
బిగుతైన దుస్తులు ధరించడం, గాలి సరిగ్గా ఆడక పోవడం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం, మాయిశ్చరైజర్ ను అప్లై చెయ్యకపోవడం తదితర కారణాల వల్ల అండర్ ఆర్మ్స్ నల్లగా, అసహ్యంగా మారుతుంటాయి.నలుపు కారణంగా తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.
స్లీవ్ లెస్ దుస్తులు వేసుకోవడానికి జంకుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సూపర్ ఎఫెక్టివ్ రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.
![Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Effectiveremedy, Underar Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Effectiveremedy, Underar](https://telugustop.com/wp-content/uploads/2024/10/Super-effective-remedy-to-make-dark-underarms-white-and-smoothc.jpg)
ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే మీ డార్క్ అండర్ ఆర్మ్స్ కొద్ది రోజుల్లోనే వైట్ గా మరియు స్మూత్ గా మారుతాయి.మరి ఇంతకీ ఆ రెమెడీ ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేయండి.ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, వన్ టేబుల్ స్పూన్ ఎర్ర కందిపప్పు వేసుకుని మెత్తని పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పౌడర్ లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్( Coffee powder ), వన్ టేబుల్ స్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్( Orange Peel Powder ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) మరియు సరిపడా ఫ్రెష్ పొటాటో జ్యూస్ వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
![Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Effectiveremedy, Underar Telugu Tips, Remedy, Latest, Skin Care, Skin Care Tips, Effectiveremedy, Underar](https://telugustop.com/wp-content/uploads/2024/10/Super-effective-remedy-to-make-dark-underarms-white-and-smoothd.jpg)
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అండర్ ఆర్మ్స్ లో అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆ తర్వాత తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై తడి లేకుండా అండర్ ఆర్మ్స్ ను తుడుచుకుని మంచి మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ ను అప్లై చేసుకోవాలి.
రెండు రోజులకు ఒకసారి ఈ సింపుల్ అండ్ పవర్ ఫుల్ హోమ్ రెమెడీని కనుక పాటిస్తే మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.ఈ రెమెడీ అండర్ ఆర్మ్స్ లో నలుపును చాలా వేగంగా పోగొడుతుంది.
మృత కణాలను తొలగిస్తుంది.చాలా తక్కువ టైంలోనే మీ డార్క్ అండర్ ఆర్మ్స్ ను వైట్ గా మరియు స్మూత్ గా మారుస్తుంది.
కాబట్టి తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.