కెనడా నిండిపోయింది.. నీ దేశానికి పో , భారతీయుడిపై నోరు పారేసుకున్న కెనడియన్ మహిళ

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్లు ఉన్నారంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఆయన మాటలతో గడిచిన ఏడాది కాలంగా ఇండో కెనడాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి.

 Indian-origin Man Shares Racist Encounter In Canada Details, Indian, Racist Comm-TeluguStop.com

మధ్యలో కాస్త సైలెంట్ అయిన ట్రూడో గత వారం బాంబు పేల్చాడు.నిజ్జర్ హత్య కేసులో ఏకంగా కెనడాలో భారత రాయబారిగా ఉన్న సంజయ్ కుమార్ వర్మను అనుమానితుల జాబితాలో చేర్చాడు.

Telugu Canada, Canada Nri, Canada Racist, Canadian, India Canada, Indian, Indian

దీనిపై భారత్ భగ్గుమంది.ట్రూడో కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయని ఘాటుగా బదుల్చింది.అలాగే ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమీషనర్ సహా దౌత్య సిబ్బందిని బహిష్కరించింది.అయితే తాను చేసిన వ్యాఖ్యలపై నిలబడాల్సిన ట్రూడో పూర్తిగా చేతులెత్తేశారు.నిజ్జర్ హత్యపై నిఘా వర్గాల సమాచారమే తప్పించి, బలమైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలతో ఆయన ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

Telugu Canada, Canada Nri, Canada Racist, Canadian, India Canada, Indian, Indian

ట్రూడో చర్యల కారణంగా ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన వ్యక్తి కెనడాలో జాతి విద్వేషానికి గురయ్యాడు.బాధితుడిని అశ్విన్ అన్నామలైగా( Ashwin Annamalai ) గుర్తించారు.ఇతను తనకు జరిగిన అవమానాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు.అంటారియోలోని వాటర్లూలో( Waterloo ) ఈ ఘటన జరిగింది.సదరు వీడియోలో అన్నామలై తనను కెనడియన్ పౌరుడినని ఓ మహిళకు చెబుతుండగా .ఆమె నమ్మదు.నువ్వు కెనడియన్‌వి కాదని, భారతీయులతో( Indians ) కెనడా నిండిపోయిందని .మీరంతా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లాలంటూ అక్కసు వెళ్లగక్కింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిపై వాటర్లూ ఎంపీ కేథరన్ ఫైఫె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తమ ప్రాంతంలో అత్యధికంగా ద్వేషపూరిత నేరాలు జరుగుతున్నాయని తెలిపారు.ధైర్యంగా తనకు జరిగిన అవమానాన్ని పంచుకున్న అశ్విన్‌ను కేథరిన్ అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube