సాయిపల్లవి అన్న అని పిలిస్తే అలా ఫీలయ్యాను.. శివకార్తికేయన్ కామెంట్స్ వైరల్!

హీరో శివ కార్తికేయన్, సాయి పల్లవి (Hero Siva Karthikeyan, Sai Pallavi)జంటగా నటించిన తాజా చిత్రం అమరన్(Amaran).బయోగ్రాఫికల్ యాక్షన్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Amaran Audio Launch Event Sivakarthikeyan Speech, Amaran, Audio Launch Event, Si-TeluguStop.com

ఈ సినిమా దీపావళి పండుగ కానుకగా అక్టోబర్ 31న విడుదల కానుంది.అయితే విడుదల తేదికి మరి కొద్దిరోజులే సమయం ఉండడంతో మూవీ మేకర్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు.

ఇకపోతే ఈ సినిమాలో శివ కార్తికేయన్ ఆర్మీ అధికారి మేజర్ ముకుందన్ వరదరాజన్ పాత్రలో కనిపించబోతున్నారు.

Telugu Amaran, Launch, Sai Pallavi, Speech-Movie

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా చెన్నై వేదికగా దీని ఆడియో లాంచ్‌ ఈవెంట్‌ ( audio launch event) ను ఘనంగా నిర్వహించారు.పలువురు ప్రముఖులు హాజరై సందడి చేశారు.ఈ కార్యక్రమంలో సాయి పల్లవిని శివకార్తికేయన్‌(sivakarthikeyan) ప్రశంసించారు.

ఈ సందర్భంగా శివ కార్తికేయన్ మాట్లాడుతూ.మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ (Major Mukund Varadarajan)గురించి మొదట వార్తల్లో విన్నాను.

రాజ్‌ కుమార్‌ ఈ కథను వివరించినప్పుడు భావోద్వేగానికి గురయ్యాను.ముకుంద్‌ గొప్ప లీడర్‌.

కశ్మీర్‌లో 100 రోజుల పాటు యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించాము.రాత్రిపూట కావడంతో చలి ఎక్కువగా ఉండేది.

ఈ చిత్రం క్లైమాక్స్‌ అందరినీ కంటతడి పెట్టిస్తుంది.

Telugu Amaran, Launch, Sai Pallavi, Speech-Movie

ముకుంద్‌ అందమైన జీవితాన్ని, ఆయన కుటుంబాన్ని అందరూ గౌరవించేలా దీన్ని తీర్చిదిద్దాము.ఈ సినిమా కోసం ఆయన కుటుంబాన్ని సంప్రదించినప్పుడు తమిళ హీరోతోనే తీయాలని వాళ్లు కోరారు.ముకుంద్‌ కు తమిళ పరిశ్రమ అంటే ఎంతో ఇష్టమని చెప్పారు.

నేను ఒక టీవీ ఛానల్‌లో వర్క్‌ చేస్తున్నప్పుడు సాయి పల్లవిని మొదటిసారి కలిశాను.నేను వ్యాఖ్యతగా వ్యవహరించిన ఒక కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

ఇండస్ట్రీలో ఆమె పేరే ఒక బ్రాండ్‌.ప్రేమమ్‌ సినిమాలో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను.

ఫోన్‌ చేసి ప్రశంసించాను.ఆమె వెంటనే థ్యాంక్యూ అన్నా అని అనింది.

నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా ఫీల్ అయ్యాను.ఆమె గొప్ప నటి అని చెప్పు కొచ్చారు శివ కార్తికేయన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube