'సౌందర్య - రమ్యకృష్ణ' ల మధ్య గొడవకు అదే ఆజ్యం పోసిందా?

ఇండస్ట్రీ అన్నాక పోటీ ఉండనే ఉంటుంది.వారికి మించి క్రేజ్ పెంచుకుని ఎక్కువ అవకాశాలు అందుకోవాలని , తనకే ఎక్కువ ఫాలోయింగ్ ఉండాలని ఇలా చాలా రకాలుగా పోటీలు ఉంటాయి.

 Conflicts Between Ramya Krishna And Soundarya , Conflicts , Ramya Krishna , So-TeluguStop.com

అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ఆ పోటీతత్వం గొడవలకి కూడా దారి తీస్తుంది.ఇదే తరహాలో అప్పట్లో ఓ స్టార్ హీరోయిన్ల మధ్య విబేధాలు తలెత్తాయి అని కుప్పల కుప్పలుగా పుకార్లు వినిపించాయి.

స్టార్ హీరోయిన్ సౌందర్య, మరో క్రేజీ హీరోయిన్ రమ్య కృష్ణ లు అప్పట్లో పోటాపోటీగా సినిమాలు చేసేవారు.ఇద్దరు కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు.

అప్పట్లో పోటీ బాగా ఉండేది.అయితే వీరి మధ్య అనూహ్యంగా ఒక పెద్ద అగాధం ఏర్పడింది అని, దాంతో వీరి మద్య కనీసం మాటలు లేవు సరికదా, ఒకరు పేరు చెబితే మరొకరు కోపంతో ఊగిపోయేవారు అని చాలా వార్తలే వినిపించాయి.

అయితే వారి మధ్య గొడవలకు ప్రధాన కారణం ఇదే అని చెబుతున్నారు కొందరు సినీ ప్రముఖులు.ఇంతకీ ఆ విషయం ఏంటన్నది ఇపుడు తెలుసుకుందాం.

Telugu Biggest, Competitiveness, Conflicts, Ego Classes, Simha, Pavitra Bandham,

నరసింహ చిత్రం ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యింది మనకు తెలిసిందే.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా సౌందర్య చేయగా, అందమైన పవర్ఫుల్ విలన్ రోల్ లో రమ్య కృష్ణ జీవించేశారు.అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ, సౌందర్య ముఖాన్ని కాలితో తన్నే పాత్ర ఉంటుంది.కాగా ఆ సమయం లోనే ఆ విషయం లోనే వాటి మధ్య ఇగో క్లాసెస్ వచ్చాయని అప్పటి నుంచి వీరి మధ్య గొడవలు అయ్యాయి అని చాలా వార్తలు వినిపించాయి.

ఆ తర్వాత మరొక విషయం ఏమిటంటే.!! సౌందర్య నటించిన పవిత్ర బంధం చిత్రం అప్పట్లో ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ హిట్ ను అందించింది.

ఆ సినిమాలో సౌందర్య పాత్రకు ఎనలేని ఆదరణ లభించింది.అయితే ఈ సినిమా కోసం మొదట హీరోయిన్ గా మరో హీరోయిన్ ఎంచుకున్నారట, ఆమె మరెవరో కాదు రమ్యకృష్ణ.

ముందుగా పవిత్ర బంధం సినిమా లో హీరోయిన్ పాత్ర కోసం రమ్యకృష్ణ సెలెక్ట్ చేసారట.

Telugu Biggest, Competitiveness, Conflicts, Ego Classes, Simha, Pavitra Bandham,

ఆమె డేట్స్ కూడా తీసుకున్నారు నిర్మాతలు, ఇంకొద్ది రోజుల్లో షూటింగ్ మొదలు కావాల్సి ఉన్న సమయం లో… ఆ సినిమా దర్శకుడు హీరోయిన్ పాత్ర కోసం సౌందర్య అయితేనే బాగుంటుందని పట్టుబట్టి కూర్చోవడంతో తప్పక ఆ పాత్ర కోసం రమ్యకృష్ణ తొలగించి సౌందర్యను కాస్త కష్టం గానే తీసుకున్నారు నిర్మాతలు.కట్ చేస్తే ఆ చిత్రంలో సౌందర్య తప్ప మరి ఇంకేం హీరోయిన్ అంతటి నటనను కనబరిచి ఉండదు ఏమో అన్నట్లుగా అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్నారు సౌందర్య. అయితే ముందుగా రమ్యకృష్ణను సెలెక్ట్ చేసి మళ్లీ రిజక్ట్ చేయడంతో , దాని వెనక సౌందర్య హస్తం ఉందని ఆమె ఫీలయ్యారని అలా వారి మధ్య గొడవలు జరిగే అది చాలా న్యూస్ లు రాగా…నిజానికి వీరి మద్య అసలు ఎటువంటి గొడవలు లేవని సినిమా అందాక పోటీతత్వం అయితే కచ్చితంగా ఉంటుందని, అంతే తప్పితే వీరి మధ్య ఎటువంటి గొడవలు ఎప్పుడూ చూడలేదని వారి తోటి హీరోయిన్లు పలువురు పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు.

రమ్య కృష్ణ గారు సైతం పలు మార్లు సౌందర్య ని పొగుడుతూ ఆకాశానికెత్తేసిన సందర్భాలు ఉన్నాయి.కాబట్టి ఇవన్నీ కాదు చూస్తే మీరే మధ్య ఎటువంటి గొడవలు లేవని అవంత ఒట్టి పుకార్లే అని అర్థమవుతోంది.

అయితే ఒకరికి దక్కాల్సిన పాత్రలు మరొకరికి దక్కడం వంటి సందర్భాలలో మాత్రమే కొంచెం ఫీల్ అవుతూ ఉండేవారట.మిగిలిన సమయంలో సరదాగానే ఉండేవారని వార్తలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube