లివర్ అనేది శరీరంలో ఉండే అతి పెద్ద అవయవం అలాగే పెద్ద గ్రంధి కూడా.లివర్ విడుదల చేసే పైత్య రసం కొలస్ట్రాల్ మరియు హార్మోన్స్ ని నియంత్రిస్తుంది.
లివర్ మినరల్స్, విటమిన్స్ దాచుకొని శరీరానికి అవసరం అయినప్పుడు అందిస్తుంది.అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది లివర్ వ్యాధుల బారిన పడుతున్నారు.
అటువంటి వారి కోసం ఈ ఆర్టికల్.ఎందుకంటే ఈ ఆర్టికల్ లో లివర్ ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని ఆహారాల గురించి తెలుసుకుందాం.
కాఫీ త్రాగే అలవాటు ఉన్నవారు ప్రతి రోజు రెండు కప్పుల కాఫీని త్రాగితే లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.కాఫీ త్రాగటం వలన ఒక ఎంజైమ్ చురుగ్గా పనిచేసి లివర్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
ప్రతి రోజు ఒక ప్రోటీన్ షేక్ త్రాగటం వలన లివర్ పదిలంగా ఉంటుందని చెప్పవచ్చు.ప్రోటీన్ షేక్ లో ఉండే గ్లూటామైన్ లివర్ లో కొత్త కణాలను నిర్మించటంలో సహాయపడుతుంది.
అందువల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
ప్రతి రోజు పెరుగు త్రాగే అలవాటు ఉన్నవారిలో లివర్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది.ఎందుకంటే పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా లివర్ లోకి చేరి లివర్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.అంతేకాక ఆహారం త్వరగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
ప్రతి రోజు ఒక నారింజ పండు తింటే లివర్ ని ఆరోగ్యంగా ఉంచుతుంది.నారింజలో ఉండే విటమిన్ సి లివర్ లోని వ్యర్ధాలను బయటకు పంపి కొవ్వు లివర్ లోకి చేరకుండా చేస్తుంది.