బాలయ్యకు హ్యాట్సాఫ్.. అఖండ రేట్లపై అలా అన్నారు.. నిర్మాత కామెంట్స్ వైరల్!

ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలలో ఒకరైన నట్టి కుమార్ తెలంగాణ రాష్ట్రంలో ఊహించని స్థాయిలో టికెట్ రేట్లను పెంచి చిన్న సినిమాలకు ఆ టికెట్ రేట్లను అమలు చేయడంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.ప్రభుత్వాలు యూనియన్ల విషయంలో భయపడతాయని నట్టి కుమార్ అన్నారు.

 Star Hero Balakrishna Comments About Akhanda Movie Ticket Rates Details, Tollywo-TeluguStop.com

తాను ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తే న్యూసెన్స్ చేస్తున్నానని ప్రభుత్వ అధికారులు కంప్లైంట్ ఇస్తారని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.

లంచం లేని ప్రభుత్వం రావాలని ఆ ప్రయత్నం సీఎం జగన్ చేస్తున్నారని ఆఫీసర్లు కూడా చేయాలని నట్టి కుమార్  చెప్పుకొచ్చారు.

ఏసీబీ అధికారులు పట్టుకున్నా అధికారులలో భయం లేదని నట్టి కుమార్ పేర్కొన్నారు.పెద్ద సినిమాల నిర్మాతల ఆవేదన కరెక్ట్ కాదని తాను చెప్పడం లేదని అందరూ బాగుంటేనే సినిమా ఫీల్డ్ అని నట్టి కుమార్ తెలిపారు.

అయితే దోచుకునే విధంగా టికెట్ రేట్లు ఉండకూడదని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.

చిన్న సినిమాల నిర్మాతలకు అనుకూలంగా ప్రకటనలు రావని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు.

Telugu Akhanda, Ap Cm Jagan, Ap Ticket Rates, Balakrishna, Natti Kumar, Small Bu

అఖండ విషయంలో బాలకృష్ణకు హ్యాట్సాఫ్ అని ప్రజలు మనకు దేవుళ్లు అని ప్రజలు ఈ రేటులోనే సినిమాలు చూడాలని సినిమా మనకు అన్యాయం చేయదని బాలయ్య చెప్పారని నట్టికుమార్ చెప్పుకొచ్చారు.ఆ సినిమాకు రిపీట్ ఆడియన్స్ 5 టైమ్స్ ఎక్కువగా వచ్చారని నట్టికుమార్ వెల్లడించారు.

Telugu Akhanda, Ap Cm Jagan, Ap Ticket Rates, Balakrishna, Natti Kumar, Small Bu

తక్కువ టికెట్ రేట్ల వల్ల ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లడం సాధ్యమవుతుందని నట్టికుమార్ చెప్పుకొచ్చారు.ఫ్యామిలీలు సినిమాకు దూరమైతే కలెక్షన్లు తక్కువగా వస్తాయని నట్టికుమార్ వెల్లడించారు.సినిమాకు రీజనబుల్ రేట్లు పెట్టాలని ఎక్కువ టికెట్ రేట్ల వల్ల నష్టమేనని నట్టికుమార్ చెప్పుకొచ్చారు.అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా టికెట్ రేట్లు ఉంటే మంచిదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో టికెట్ రేట్లు భిన్నంగా ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube