గణేష్ పాత్రో.మాటల రచయితగా తెలుగులో ఎంతోమంది ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.1945 జూన్ 22వ తారీఖున విజయనగరం జిల్లా, పార్వతీపురం లో జన్మించిన గణేష్ పాత్రో తొలుత నాటకాలకు రచనలు చేసేవారు.1970లో కొడుకు పుట్టాలా అనే ఒక నాటికతో భారతదేశం మొత్తం కూడా మంచి పేరును సంపాదించుకున్నారు.ఈ నాటకం తెలుగులో పుట్టి ఇండియాలోని అన్ని భాషల్లోకి అనువాదం అయింది.దూరదర్శన్, ఆకాశవాణిలో సైతం ప్రసారమైంది.దీంతో ఆయన కేవలం ఐదేళ్ల కాలంలో అగ్రశ్రేణి నాటక కర్తగా మారిపోయారు.గణేష్ పాత్రో చాలా తక్కువ నాటికలు రచించిన కూడా అవి ఎంతో బాగా రక్తి కట్టేవి.
అందుకే గణేష్ పాత్ర ఒక ప్రతిభాశాలి అని చెప్పాలి.
ఆయన నటించిన రచించిన రచనల్లో తెరచిరాజు, మృత్యుంజయుడు, తరంగాలు, కొడుకు పుట్టాలా, అసుర సంధ్య నాటకాలు, లాభం, పావలా, త్రివేణి, ఆగండి కొంచెం ఆలోచించండి వంటి ఎన్నో నాటకాలను ఆయన రచించారు.
ఇక ఆ తర్వాత ఆయన 1976 లో సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు అత్తవారిల్లు అనే సినిమాతో మాటలు రచయితగా తెలుగు సినిమాకి పరిచయమై చివరగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టుతో తన ప్రయాణాన్ని ముగించారు.ఆయన రచించిన ఒక్కో సినిమా ఒక అద్భుతం.
లోతైన సంభాషణలతో, ఎన్నో విలువైన మాటలు చెప్పడం ఆయన వ్యక్తిత్వం.ఒక దేహానికి ఆత్మ ఎలా ఉంటుందో ఆయన సినిమాకి మాటలు అలా సోల్ ని నింపేవి.
ఇక ఆయన మాటను అందించిన ఆ సీతారామయ్య గారి మనవరాలు సినిమా అయితే ఒక ఆణిముత్యం అనే చెప్పాలి.నాగార్జున సినిమా నిర్ణయంలో అద్భుతమైన పాట రాసి ఇప్పటికీ యువత ఆ పాట పాడుకునేలా చేయడంలో గణేష్ పాత్రో ఎంతగానో తన ప్రతిభను ప్రదర్శించారు.హలో గురు ప్రేమకోసమేరా పాట వల్ల ఆ సినిమా హిట్ అయింది అంటే కూడా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలో ఈ పాటను రాసింది గణేష్ పాత్రో.
అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఏకంగా 15 ఏళ్ల పాటు విరామం తీసుకున్నారు.చివరగా 9 నెలలు అనే సినిమాకు ఆయన మాటలు అందించారు.
ఈ సినిమా సౌందర్య సినిమా కావడం విశేషం.ఆ తర్వాత దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత మహేష్ బాబు నటించిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి మళ్ళీ మాటలు అందించారు.
ఆ తర్వాత 2015లో చెన్నైలో క్యాన్సర్ వ్యాధితో కన్నుమూశారు.