టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. టీం వివరాలు ఇలా.!

రోహిత్ శర్మ( Rohit Sharma ) నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు, నజ్ముల్ హుస్సేన్ శాంటో( Nazmul Hossain Shanto ) నేతృత్వంలోని బంగ్లాదేశ్ జట్టు మధ్య నేటి (సెప్టెంబర్ 27) నుండి కాన్పూర్‌లోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు.

 India Win Toss And Bowl First In Kanpur Test Against Bangladesh Details, Ind Vs-TeluguStop.com

రోహిత్ శర్మ సారథ్యంలో బంగ్లాదేశ్‌తో( Bangladesh ) జరిగిన చెన్నై టెస్టు మ్యాచ్‌లో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఇక ఈ మ్యాచ్ లో భారత జట్టులో ఎలాంటి మార్పు లేదు.

Telugu Bangladesh, Ind Ban, Ind Ban Dream, Ind Ban Live, India Win, Kanpur, Nazm

వర్షంతో మైదానం తడిసిపోవడంతో టాస్‌ ఆలస్యమైంది.గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో అతిధులను క్లీన్ స్వీప్ తో తుడిచిపెట్టేయాలని టీమిండియా( Team India ) ఉవ్విళ్లూరుతోంది.రెండో టెస్టులో విజయం సాధించడం ద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తన నంబర్-1 స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది.అయితే, కాన్పూర్ టెస్టు తొలి మూడు రోజులు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి.

మరి ఈ వర్షం అభిమానుల మజాను పాడు చేస్తుందో లేదో చూడాలి మరి.

Telugu Bangladesh, Ind Ban, Ind Ban Dream, Ind Ban Live, India Win, Kanpur, Nazm

ఇండియా (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), KL రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): షాద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (సి), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (W), మెహదీ హసన్ మిరాజ్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్ , ఖలీద్ అహ్మద్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube