సూర్యాపేట జిల్లా: (Suryapet District)చిలుకూరు మండల కేంద్రంలో ఉన్న సొసైటీలో అన్నదాతలు రుణమాఫీ కాలేదని నిరసన వ్యక్తం చేస్తే వారిని అక్రమంగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం సరికాదని బిఆర్ఎస్(BRS) అనంతగిరి మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు భూక్య బోస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు( Rythu Bandhu) ఇవ్వకుండా రైతులను మోసం చేస్తుందని,విద్యుత్ 24 గంటలు ఇస్తామని రైతులను నమ్మించి, విద్యుత్ కోతలతో రైతులను ఇబ్బందులు పెడుతున్నారని,వచ్చే విద్యుత్ సక్రమంగా రాకపోవడంతో రైతుల మోటార్లు కాలిపోతున్నాయన్నారు.
రైతుల గురించి పట్టించుకోని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు.అనంతగిరి మండల పరిధిలోని కిష్టాపురం, గొండ్రియాల,కొత్తగూడెం, గ్రామాల్లో వరద ప్రవాహంతో కొన్ని విలువైన వస్తువులు, ప్రహరీ గోడలు ధ్వంసం కావడం,అలాగే పంట నష్టం జరిగిందని,వరద బాధితులకు ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.