1.రాహుల్ గాంధీ ములాకత్ కు అనుమతి నిరాకరణ
చంచల్గూడ జైలులో ఉన్న కాంగ్రెస్ విద్యార్థి విభాగం నాయకులను పరామర్శించేందుకు రాహుల్ గాంధీ వారితో ములాకత్ అయ్యేందుకు అనుమతి కోరినా చంచల్ గూడ జైలులో అనుమతి లభించలేదు.
2.హైదరాబాద్ లో హరీష్ రావు పర్యటన
హైదరాబాద్ లో మంత్రి హరీష్ రావు పర్యటించారు.ఎర్రగడ్డ చెస్ట్ ఆసుపత్రిలో సిటీ స్కాన్, కోటి ఈఎన్టీ ఆసుపత్రి , సుల్తాన్ బజార్ మెటర్నీ లో పలు వైద్య సేవలను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు.
3.సరూర్నగర్ హత్య పై గవర్నర్ స్పందన
సరూర్ నగర్ లో యువకుడు నాగరాజు హత్య ఉదంతం పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు.మతాంతర వివాహం కాబట్టి ఈ ఈ హత్య పై నివేదిక ఇవ్వాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారు.
4.కేటీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.‘ మీ పాలనపై ఏం అధ్యయనం చేయాలి కేటీఆర్ ,? రుణమాఫీ ఎలా ఎగ్గొట్టాలి ? ఎరువుల ఫ్రీ అంశాన్ని ఎలా అటక ఎక్కించాలి అనే అంశాలపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
5.షర్మిల ధర్నా
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో రైతులతో కలిసి వైయస్ షర్మిల ధర్నాకు దిగారు.మద్దతు ధరకు వరి ధాన్యం కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
6.రాహుల్ సభకు కోమటిరెడ్డి దూరం
వరంగల్లు జరగనున్న రాహుల్ గాంధీ సభకు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు దీనికి అనారోగ్య సమస్యలే కారణంగా ఆయన అనుచరులు తెలిపారు.
7.తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలి : కోదండరాం
కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ఈరోజు జరిగింది.ఈ సందర్భంగా తెలంగాణకు న్యాయమైన వాటా ఇవ్వాలని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు.
8.తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.ఈ నెల 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.
9.గ్రూప్ వన్ పోస్టులకు 26,629 దరఖాస్తులు
గ్రూప్-1 పోస్టులకు , గురువారం నాటి వరకు 26,629 దరఖాస్తులు వచ్చినట్లు టీపీ ఎస్సీ అధికారులు తెలిపారు.
10.మైనారిటీల ద్రోహి వెల్లంపల్లి : జనసేన
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మైనారిటీల ద్రోహి అని జనసేన కీలక నాయకుడు మహేష్ విమర్శించారు.
11.నాదెండ్ల మనోహర్ విమర్శలు
ఏపీ సీఎం జగన్ పై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు.జగన్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, పాలనా దక్షత లేని వ్యక్తి జగన్ అని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
12.పొత్తుల అంశంపై స్పందించిన చంద్రబాబు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన సమయం వచ్చిందని దానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహిస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పరోక్షంగా పొత్తుల అంశాన్ని ప్రస్తావించారు.
13.జగన్ ప్రభుత్వం పై లోకేష్ విమర్శలు
ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేశారు.కుళ్లు, కుతంత్రాలతో మా పై దుష్ప్రచారం చేస్తున్నారని లోకేష్ విమర్శలు చేశారు.
14.కుప్పంలో చంద్రబాబు పర్యటన
ఈనెల 12వ తేదీ నుంచి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
15.ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్
ఛత్తీస్ ఘడ్ లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు పోలీసులు మధ్య ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.ఈ ఎన్కౌంటర్ లో ఇప్పటి వరకు ఎవరు మరణించలేదని పోలీసులు తెలిపారు.
16.చంద్రబాబు ఘాటు విమర్శలు
ఏపీలో పదో తరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేని జగన్ మూడు రాజధానులు కడతాడా అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేశారు.
17.బీజేపీపై కేటీఆర్ విమర్శలు
దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తెలంగాణ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిజెపిపై విమర్శలు చేశారు.
18.విదేశీ వస్తువులకు బానిస కావద్దు : ప్రధాని
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు దాటుతున్నా ఇప్పటికీ ఇంకా విదేశీ వస్తువులను వినియోగించడం సరి కాదని ప్రధానమంత్రి నరేంద్రమోది అన్నారు.
19.కాజల్ కీలక నిర్ణయం ఇదేనంటూ…
సినీ నటి కాజల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఆమె ఇక సినిమాలకు పుల్ స్టాప్ పెట్టినా ఉన్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి అయితే దీని పై కాజల్ అధికారికంగా స్పందించలేదు.
20.ఈరోజు బంగారం ధరలు
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -47,100 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 51,380
.