యంగ్ టైగర్ ఎన్టీఆర్( NTR ) నటించిన దేవర సినిమా( Devara Movie ) నేడు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.నేడు పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.
ఇలా ఈ సినిమా కోసం గత మూడు సంవత్సరాలుగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు.ఎన్టీఆర్ నటించిన RRR సినిమా తర్వాత విడుదల కాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు ఉన్నాయి.
రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం నేడు భారీ స్థాయిలో విడుదలైంది.
ఇక అన్ని ప్రాంతాలలో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది.ఇకపోతే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన పట్ల ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్పందిస్తూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈరోజు మొత్తానికి వచ్చేసింది.
అభిమానుల అపురూపమైన స్పందనతో ఉబ్బితబ్బిపోతున్నాను.అభిమానులు చూపించే ఈ ప్రేమకు రుణపడి ఉంటానని ఎప్పుడు మిమ్మల్ని ఇలాగే అలరిస్తూ ఉంటానని ఈయన ప్రేక్షకులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు.
ఇక ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.డైరెక్టర్ కొరటాల శివ( Koratala Shiva ) అలాగే నిర్మాతలు, డిఓపీకి కూడా ప్రత్యేకంగా ఎన్టీఆర్ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక నేడు అర్ధరాత్రి నుంచి దేవర సినిమా మొదటి షో ప్రారంభం కావడంతో అభిమానులు భారీ స్థాయిలో థియేటర్ల వద్దకు చేరుకొని హంగామా చేస్తున్నారు పలుచోట్ల అభిమానుల మధ్య గొడవలు కూడా జరుగుతున్న సంగతి తెలిసిందే.ఏది ఏమైనా ఆరు సంవత్సరాల తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా పట్ల భారీ అంచనాలే నెలకొన్నాయి.