యంగ్ టైగర్ ఎన్టీఆర్ ( Ntr ) దేవర సినిమా ( Devara ) ద్వారా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో నటించిన దేవర సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రెండు భాగాలుగా ఈ సినిమా రాబోతుంది.
ఇక మొదటి భాగం నేడు విడుదల కాగా భారీ స్థాయిలో ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తుంది.
ఇప్పటికే థియేటర్లలో ఈ సినిమా మొదలైపోగా.ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి.దీని ప్రకారం.
ఈ సినిమాను తీవ్ర పోటీ నడుమ నెట్‌ఫ్లిక్స్ సంస్థ తీసుకుంది.ఈ విషయాన్ని సినిమా టైటిల్ కార్డులో రివీల్ చేశారు.
ఇందుకోసం సదరు సంస్థ భారీ మొత్తాన్ని కూడా నిర్మాతలకు ముట్టజెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.ఇక ఈ సినిమా ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయంపై కూడా అభిమానులలో ఎంతో ఆతృత నెలకొంది.
నిజానికి థియేటర్లో సినిమా విడుదలైన నాలుగు వారాలకే తిరిగి ఓటీటీలో ప్రసారమవుతాయి.కానీ ఈ సినిమా మాత్రం థియేటర్లో విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలో విడుదల చేసేలా నెట్ ప్లిక్స్ నిర్మాతలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం.అంటే సెప్టెంబర్ 27వ తేదీన విడుదలైన ఈ చిత్రం నవంబర్ 3 వారంలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన సంగతి తెలిసిందే.
ఇక ఎన్టీఆర్ సరసన నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు.