చిరంజీవి వదిలేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన మోహన్ బాబు!

కలెక్షన్ కింగ్! మంచు మోహన్ బాబు( Manchu Mohan Babu ) నటించిన సినిమా “అల్లుడగారు” చిత్రం( Alludagaru ) అప్పట్లో ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసుకుందో తెలిసిన విషయమే.90వ దశకంలో తిరుగులేని హీరోగా పేరు తెచ్చుకున్న హీరోలలో మోహన్ బాబు ఒకరు.అందుకే అతనిని అప్పట్లో కలెక్షన్ కింగ్ అనే ట్యాగ్ లైనుతో పిలిచేవారు.ఆయన సినీ ప్రయాణంలో అల్లుడుగారు అనే సినిమా ఓ మచ్చు తునక అని చెప్పుకోవచ్చు.

 Mohan Babu Hit Movie Rejected By Chiranjeevi , Manchu Mohan Babu, Chiranjeevi ,-TeluguStop.com

ఈ క్రమంలోనే వచ్చిన అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ, రౌడీగారిపెళ్లాం, పెదరాయుడు, అల్లరి మొగుడు, కుంతీపుత్రుడు లాంటి చిత్రాలు అతనిని పెద్ద హీరోని చేసాయి అని చెప్పుకోవచ్చు.

Telugu Alludagaru, Chiranjeevi, Raghavendra Rao, Lakshmiprasanna, Mohan Babu, Mo

ఇక అల్లుడుగారు సినిమా విషయానికొస్తే, మోహన్ బాబు ( Mohan Babu )సొంత బ్యానర్ అయినటువంటి లక్ష్మీప్రసన్న బ్యానర్( Lakshmiprasanna banner ) పై కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఈ సినిమా కథ మొదట్లో మెగాస్టార్ చిరంజీవి వద్దకు వచ్చిందట.

దర్శకుడు రాఘవేంద్రరావుకు( Director Raghavendra Rao ) ఈ సినిమాను ముందుగా చిరంజీవితో చేయలని భావించారు.దీనికి ముందే ఇద్దరూ జగదేక వీరుడు అతిలోక సుందరి పేరుతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు.

దాంతో వీరిద్దరి కాంబినేషన్లో మరలా ఈ సినిమాతో హిట్టు కొట్టాలని భావించారు.ఈ నేపథ్యంలోనే అల్లుడుగారు కథను చిరంజీవికి వినిపించారు.అయితే ఈ సినిమా క్లైమాక్స్ నచ్చక, చిరు కొన్ని మార్పులు సూచించారట! అయితే క్లైమాక్స్ మార్చడం ఇష్టంలేక.అల్లుడుగారు సినిమాని రాఘవేంద్రరావు హీరో మోహన్ బాబుతో తీసారట.

Telugu Alludagaru, Chiranjeevi, Raghavendra Rao, Lakshmiprasanna, Mohan Babu, Mo

కట్ చేస్తే, తరువాత ఆ సినిమా దుమ్ముదులిపేసింది.ఇకపోతే, సినిమా కథ ప్రకారం క్లైమాక్స్ లో హీరోకు ఉరిశిక్ష పడుతుంది.అలా ఉరిశిక్ష పడితే అభిమానులకు నచ్చదని, క్లైమాక్స్ ను మారిస్తే బావుంటుందని చిరు అభిప్రాయ పడ్డారట.కాగా రాఘవేంద్రరావు చిరంజీవి నిర్ణయంలో ఏకీభవించి మొదట క్లైమాక్స్ మారుద్దామనుకున్నారు.

కానీ, సినిమా కథ మొత్తం క్లైమాక్స్ మీదే ఆధారపడివుంటుంది కాబట్టి తరువాత దీన్ని మార్చలేక కథ ప్రకారం సినిమా తీయాలని అనుకొని, మోహన్ బాబును హీరోగా ఎంచుకున్నారు.ఇకపోతే ఈ సినిమాతో మోహన్ బాబుతోపాటుగా శోభన, చంద్రమోహన్, సత్యనారాయణ లాంటి నటులు నటించడం జరిగింది.

ఈ సినిమాతో మోహన్ బాబు దశ మొత్తం తిరిగిపోయింది అని చెప్పుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube