సినిమా హీరోలకైనా, హీరోయిన్లకైనా వారి శరీరమే వారికి పెట్టుబడి.ఆ శరీరం క్షిణించింది అంటే ఇక వారి కెరీర్ కూడా క్లోజ్ అయిపోతుంది.
అందుకే వారు వారి గ్లామర్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు.ఇక హీరోయిన్లకైనా తమ శరీరంలో వయస్సుకి తగ్గట్టు మార్పులు, చేర్పులు చోటు చేసుకొంటాయేమోగానీ హీరోల విషయంలో అలా కాదు.
నేడు టాలీవుడ్ ని ఓ ఏలు ఏలుతున్న ఓ నలుగురైదుగురు హీరోల విషయానికొస్తే, వారిని వయస్సు మర్చిపోయిందా? లేదా వీరు దేవతలు సేవించిన అమృతాన్ని కాని సేవించారా? అనే అనుమానం కలగక మానదు.
ఈ లిస్టులో మొదటివాడు సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ).మహేష్ బాబు అందం గురించి చెప్పాల్సిన పనిలేదు.50 ఏళ్ల మహేష్ బాబు నేటికీ తన అందంతో తెలుగు యువతులను అలరిస్తున్నాడు.ఆయనికి బాయ్స్ కంటే లేడీ ఫాలోయింగే ఎక్కువ అని చెప్పుకోవచ్చు.నేటికీ తిరుగులేని స్టార్ డంతో ఈ సూపర్ స్టార్ టాలీవుడ్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.
ఈ లిస్టులో 2వ వాడు కింగ్ నాగార్జున( King Nagarjuna ).నాగార్జున గురించి చెప్పాల్సిన పనిలేదు.65 ఏళ్ల వయస్సు కలిగిన నాగ్ అంటే ఇప్పటికీ మన ఆంటీలకు పిచ్చెక్కిపోతుంది.అయన సినిమాలు టీవీలలో వస్తే, అతుక్కు పోయి మరీ చూస్తారు సినిమాలను.

ఇక ఈ లిస్టులో 3వ హీరో విక్టరీ వెంకటేష్.( Hero Victory Venkatesh ) 63 ఏళ్ల వయస్సు గల వెంకీ అంటే మహిళామణులకు ఎనలేని అభిమానం.అయన సినిమాలకి ప్రత్యేకమైన మహిళా ఫ్యాన్ బేస్ ఉంటుంది.ఇక ఫాన్స్ గ్యాంగ్స్ తో సంబంధం లేకుండా ఈయన సినిమాలను జనాలు చూస్తూ ఉంటారు.

ఇక ఈ లిస్టులో 4వ హీరో తెలుగు జనులందరి మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) గారు.70 ఏళ్ల వయస్సు కలిగిన ఈ నట శిఖరం గురించి ఇక్కడ ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.తాజాగా అయన డాన్స్ విషయంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా కైవసం చేసుకున్నారు.ఇక అవార్డులు అయన కేరాఫ్ అడ్రెస్స్ గా మారిపోయాయి.ఇక అయన వయస్సు 70 సంవత్సరాలు అంటే నమ్మడానికి చాలా అతిశయోక్తిగా ఉంటుంది! ఇక మీకు తెలిసిన హీరోల గురించి కింద కామెంట్ చేయండి!