పాలు, పాల ఉత్పత్తులు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజల ఆహారంలో భాగమైపోయాయి.వీటివల్ల శరీర ఆరోగ్యానికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి.
అలాగే ఆయుర్వేదం సూచించినట్లు పాలలో నెయ్యి( Ghee )ని కలుపుకొని తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే నెయ్యిని పాల నుంచి తయారుచేస్తారు.
పాలను మరిగించి దాని ఇంట్లో తోడు వేస్తారు.అది కొన్ని గంటల తర్వాత గట్టిపడి పెరుగుల మారుతుంది.
అలాగే పెరుగును బాగా చిలకగా వెన్న వస్తుంది.వెన్నను వేరు చేసి దానిని బాగా మరిగిస్తే నెయ్యిగా మారిపోతుంది.
వేడిపాలలో నెయ్యిని కలుపుకొని తీసుకోవడం వల్ల శరీరానికి అనేక పోషకాలు అందుతాయి.
వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా లభిస్తాయి.అంతేకాకుండా ఇందులో ఉండే కేలరీలు అధికంగా శరీరానికి అందుతాయి.బరువు పెరగాలనుకునే వారికి, కండరాల నిర్మాణం కోరుకునే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణ వ్యవస్థ ( Digestive system )ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.పేగులలో మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ఇది ప్రోత్సహిస్తుంది.అలాగే పాలలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.వాటిలో నెయ్యి కలిపినప్పుడు ఎముకల ఆరోగ్యానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.
పాలు నెయ్యి ( Milk ghee )మిశ్రమంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి.
అంతేకాకుండా నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, పాలలోని విటమిన్లు చర్మం జుట్టు ఆరోగ్యాన్ని( Skin and hair health ) మెరుగుపరుస్తాయి.నెయ్యి పాలను పోషకాహార అమృతంగా ఆయుర్వేదంలో పరిగణిస్తారు.ఈ మిశ్రమాన్ని ఇలా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
పాలలోనీ విటమిన్లు A,D,E,K వంటి కరిగే విటమిన్లు శరీరానికి అందేలా చేస్తాయి.ఒత్తిడి నుంచి త్వరగా బయటపడాలంటే వేడి పాలలో ఒక టీ స్పూన్ నెయ్యిని వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
రాత్రి నిద్రపోయే ముందు వేడిపాలలో నెయ్యి కలిపి తాగడం వల్ల శరీరంపై సానుకూల ప్రభావం ఉంటుంది.కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు నెయ్యి పాలు( Milk ghee ) తప్పనిసరిగా తీసుకోవాలి.
ఇలా తీసుకోవడం వల్ల వాపులు, మంట కూడా తగ్గిపోతాయి.