హైబీపీ లేదా అధిక రక్తపోటుచాలా మందిలో చాలా కామన్‌గా కనిపించే సమస్యల్లో ఇదీ ఒకటి.వయసు పైబడిన వారే కాదు ఈ మధ్య కాలంలో ఇరవై ఏళ్ల వారు సైతం హైబీపీతో బాద పడుతున్నారు.
జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం, పలు రకాల మందుల వాడకం, పోషకాల లోపం ఇలా రకరకాల కారణాల వల్ల రక్త పోటు స్థాయిలు పెరిగి పోతాయి.దాంతో నీరసం, అలసట, కళ్లు తిరగడం, గుండె దడ, తీవ్రమైన తలనొప్పి, మానసిక ప్రశాంతత లోపించడం, వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చూపు తగ్గడం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అందుకే రక్త పోటు స్థాయిలను ఎప్పుడూ అదుపులో ఉంచుకోవాలి.అలా ఉంచుకోవాలీ అంటే హైబీపీ బాధితులు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.మరి ఆ జాగ్రత్తలు ఏంటో చూసేయండి.అధిక రక్త పోటు ఉన్న వారు డైట్‌లో పొటాషియం ఫుడ్‌ను చేర్చుకోవాలి.
శరీరంలో సోడియం స్థాయిని తగ్గించి రక్త పోటును కంట్రోల్‌లోకి తీసుకురావడంతో పొటాషియం ఎంతో అవసరం.కాబట్టి, టమోటాలు, బంగాళ దుంపలు, చిలగడ దుంపలు, అరటి పండ్లు, అవకాడో, నారిజ, నట్స్ వంటివి తీసుకుంటే శరీరానికి పొటాషయం లభిస్తుంది.

హైబీపీ ఉన్న వారు రెగ్యులర్‌గా చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి.తద్వారా రక్త పోటు స్థాయిలు అదుపులోకి వస్తాయి.మరియు శరీరం కూడా ఫీట్‌గా మారుతుంది.
అలాగే ఉప్పును ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది.
నిల్వ పచ్చళ్లు, నిల్వ ఉంచిన ఆహారాలు, బేకరీ ఐటమ్స్, బయట ఆహారాలు, పచ్చళ్లు, అప్పడాలు వంటి వాటికి దూరంగా ఉండాలి.

ఒత్తిడి పెరగడం వల్ల కూడా బీపీ పెరుగుతుంది.కాబట్టి, మీరు ముందు ఒత్తిడిని జయించాలి.దాంతో క్రమంగా రక్త పోటు స్థాయిలు అదుపులోకి వస్తాయి.
ఫలితంగా తలనొప్పి, చికాకు, కళ్లు తిరగడం వంటి సమస్యలు తగ్గుతాయి.మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
ఇక హైబీపీ తో ఇబ్బంది పడే వారు ఖచ్చితంగా బరువును అదుపులో ఉంచుకోవాలి.మరియు మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లను మానుకోవాలి.