శ్రీదేవి గురించి పరిచయం అక్కర్లేదు ఉత్తర, దక్షిణ అని తేడా లేకుండా అన్ని సినిమా పరిశ్రమల్లో టాప్ హీరోయిన్ గా వెలుగొందింది.అదే సమయంలో ఓసారి శ్రీదేవి చేసిన డిమాండ్ పలువురు నిర్మాతల ఆగ్రహానికి కారణం అయ్యిందట.
ఇంతకీ ఆమె ఏం డిమాండ్ చేసింది.? ఎందుకు నిర్మాతలు ఆమెపై కోప్పడ్డారు.? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం
కొండవీటి దొంగ సినిమాలో హీరోయిన్ గా చేసింది శ్రీదేవి.హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటించాడు.అయితే ఈ సినిమా చేయాలని ఆమెను సంప్రదించారట.ఆ సమయంలో శ్రీదేవి ఓ విషయాన్ని చెప్పిందట.ఈ సినిమాలో తన రోల్ చిరంజీవి రోల్ తో సమానంగా ఉండాలన్నదట.అలా అయితేనే సినిమా చేస్తాననే కండీషన్ పెట్టిందట.
ఈ విషయం బయటకు రావడంతో ఆమెపై కొందరు నిర్మాతలు ఒంటి కాలుపై లేచారట.ఆమెకు అంత అహంకారమా? అనే రీతిలో విరుచుకుపడ్డారట.


ఈ సినిమా చేసే సమయానికే బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది శ్రీదేవి.తన స్థాయిని అర్థం చేసుకుని అవకాశాలు ఇవ్వడంలో టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఫ్లాప్ అయ్యారు.దీంతో ఆమెపై పలు రకాల ప్రచారాలు చేశారు.నిజానికి శ్రీదేవి నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే తను ఓ తమిళ సినిమాలో నటించింది.తన 14వ ఏట హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.కెరీర్ తొలినాళ్లలో నటనా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేసింది.
ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కమర్షియల్ సినిమాల్లో నటించింది.అదే సమయంలో గ్లామర్ రోల్స్ లోనూ అదరగొట్టింది.

అయితే తెలుగులో ఎక్కువగా గ్లామర్ పాత్రలే రావడంతో తనకు ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉండదనే ఆలోచనకు వచ్చింది.అటు కమల్ హాసన్ తో కలిసి నటించిన మూండ్రం పిరై అనే సినిమా తెలుగులో వసంత కోకిల పేరుతో విడుదల అయ్యింది.ఈమెకు ఎనలేని పేరు తెచ్చింది.అప్పటి నుంచి మంచి నటనా ప్రాధాన్యత ఉన్న తెలుగు సినిమాలకే ఒకే చెప్పింది.చిరంజీవి సినిమాల్లో అవకాశాలు వచ్చినా.గ్లామర్ రోల్స్ ఎక్కువగా ఉండటంతో వాటిని వదులుకుంది శ్రీదేవి