కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి అమెరికా సిద్దమైంది.ఇప్పటికే పలు రాష్ట్రాలలో ఓటింగ్ ప్రారంభమైంది.
డెమొక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్( Kamala Harris ), రిపబ్లికన్ల నుంచి డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే.వీరిలో ఒకరు అమెరికా ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
సర్వేలు , ముందస్తు అంచనాల ప్రకారం ఇద్దరు నేతలు హోరాహోరీగా తలపడుతున్నారు.అమెరికాలో స్థిరపడిన అతిపెద్ద విదేశీ సమూహాల్లో ఒకటైన ఇండియన్ కమ్యూనిటీ ఈసారి ఏ వైపు మొగ్గు చూపుతుందోనని అమెరికన్ రాజకీయవేత్తలు ఉత్కంఠగా గమనిస్తున్నారు.
అమెరికాలో దాదాపు 5 మిలియన్ల మంది భారతీయులు, భారత సంతతి ప్రజలు నివసిస్తున్నారు.వారు ఎన్నికల్లో అభ్యర్ధుల గెలుపోటములను నిర్దేశించడంలో కీలకపాత్ర పోషిస్తున్నారు.యూఎస్‌లో అభివృద్ధి చెందుతున్న , ప్రభావవంతమైన కమ్యూనిటీగా ఇండియన్ డయాస్పోరా గుర్తింపు తెచ్చుకుంటోంది.మొత్తం ఓటర్లలో వారి వాటా చాలా తక్కువగా ఉన్నప్పటికీ.
ఓటింగ్ కూటమిలో భారతీయులు కీలకంగా మారుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.ముఖ్యంగా టెక్సాస్, జార్జియా, పెన్సిల్వేనియా వంటి స్వింగ్ స్టేట్స్‌లో భారతీయుల ప్రభావం ఎక్కువగా ఉంది.
అయితే ఇండియన్ డయాస్పోరా ( Indian Diaspora )పలు సమస్యలతో పోరాడుతోందని.ఇందులో ఇమ్మిగ్రేషన్ ప్రధానమైనదని కమ్యూనిటీ లీడర్లు చెబుతున్నారు .గ్రీన్‌కార్డ్ బ్యాక్‌లాగ్‌లు, హెచ్1 బీ సంస్కరణలు భారతీయులకు ఆందోళనలను కలిగిస్తున్నాయి.హెల్త్ కేర్ సెక్టార్‌లో భారతీయ హెల్త్ కేర్ వర్కర్స్‌కు మెరుగైన పని పరిస్ధితులను కల్పించాలని పలువురు కోరుతున్నారు.
రిపబ్లికన్లు తక్కువ పన్ను రేట్లు విధిస్తామని చెబుతున్నా.డెమొక్రాట్లు ధనవంతులపై పన్ను విధించి పేదల కోసం ఖర్చు చేస్తారని అంటున్నారు.
రెండు ప్రధాన పార్టీలైన డెమొక్రాట్లు, రిపబ్లికన్లు .అమెరికా రాజకీయాలలో పెరుగుతున్న ఇండియన్ కమ్యూనిటీ ప్రభావాన్ని గుర్తించి అందుకు తగినట్లుగా వ్యూహాలను రచిస్తున్నారు.ఫ్లోరిడా, జార్జియా, వర్జీనియా, న్యూజెర్సీ, పెన్సిల్వేనియాలలో భారతీయ అమెరికన్ జనాభా గణనీయమైన స్థాయిలో ఉంది.ఇటీవలి కాలంలో ప్రవాస భారతీయులు ఎన్ఆర్ఐల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.