సినిమాల్లో హీరోగా సక్సెస్ అయిన తర్వాత ఇక తామే సొంతంగా ఒక సినిమా తీసేసుకుని పెద్ద హిట్ కొట్టాలని చాలామంది హీరోలు అనుకుంటారు.ఒక కథ కూడా తమకు తగినట్లు రెడీ చేసుకుంటారు.
వాటిని సొంతంగా డైరెక్ట్ చేయాలనుకుంటారు.మిగతా ప్రొడ్యూసర్లను బతిలాడాల్సిన అవసరం లేకుండా వారే నిర్మాతగా మారుతారు.
అయితే ఇలా చేసి కొందరు చేతులు కాల్చుకుంటే, మరికొంతమంది ఇండియన్ హీరోలు మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నారు.వారిలో కొంతమంది టాప్ హీరోల గురించి తెలుసుకుందాం.
• సీనియర్ ఎన్టీఆర్(Sr NTR)
హిందూ పౌరాణిక చలనచిత్రం “దాన వీర శూర కర్ణ (1977)”(Daana Veera Soora Karna) కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.దీన్ని రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌పై సీనియర్ ఎన్టీఆర్(Senior NTR) నిర్మించారు.అంతేకాదు ఈ మూవీకి కథ కూడా రాశారు.దర్శకత్వం కూడా ఆయనే వహించారు.మహాభారతంలోని కర్ణుడి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో ఎన్టీఆర్ శ్రీకృష్ణ, కర్ణ, దుర్యోధన ( Lord Krishna, Karna, Duryodhana)వంటి మూడు పాత్రల్లో నటించి అదరగొట్టారు.ఈ సినిమా రూ.10 లక్షలతో రూపొంది రూ.2 కోట్ల దాకా కలెక్షన్లు వసూలు చేసి ఎన్టీఆర్‌కు భారీ లాభం తెచ్చిపెట్టింది.
• కాంతారా(kantara)
కన్నడ యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ కాంతారా(kantara) (2022)కు రిషబ్ శెట్టి కథ అందించడమే కాకుండా ఇందులో హీరోగా నటించాడు అంతేకాదు స్వయంగా డైరెక్ట్ చేశాడు.దీనికి ఇతను నిర్మాత కాదు.అయితే ఈ మూవీ మాత్రం రూ.450 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది.వెంకీ సీక్వెల్ కూడా తీస్తున్నారు దాన్ని కూడా రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయడమే కాకుండా అందులో కథానాయకుడిగా కనిపించనున్నాడు.ఫస్ట్ మూవీ రిషబ్ శెట్టి ద్విపాత్రాభినయం చేశాడు సెకండ్ పార్ట్ లో ఎన్ని పాత్రలు చేస్తాడో చూడాలి.
• రాకెట్రీ(Rocketry)
ఆర్.మాధవన్ 2022లో వచ్చిన బయోలాజికల్ మూవీ “రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్”ని డైరెక్ట్ చేసి స్వయంగా నిర్మించారు.దీనికి స్టోరీ కూడా ఆయనే రాశారు.ఇది భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో పనిచేసిన నంబి నారాయణన్ (Nambi Narayanan)అనే శాస్త్రవేత్త జీవితాన్ని ఆధారంగా చేసుకుని తీశారు.
నంబి నారాయణన్ పాత్రను మాధవనే (Madhavan)పోషించారు.ఈ చిత్రంలో, నంబి నారాయణన్‌ను ఒక గూఢచార కేసులో ఇరికించి, తర్వాత ఆయన నిర్దోషి అని తేలిన కథ చూపించారు.ఈ సినిమాతో గొప్ప దర్శకుడుగా తన సత్తా చాటారు మాధవన్.
• లవ్ టుడే
ప్రదీప్ రంగనాథన్ “లవ్ టుడే” సినిమాతో తనలోని మంచి రచయితను, దర్శకుడు నీవు కూడా పరిచయం చేశాడు అంతేకాదు ఈ మూవీలో హీరోగా నటించి తన అద్భుతమైన యాక్టింగ్ స్కిల్స్ బయటపెట్టాడు ఈ రొమాంటిక్ కామెడీ సినిమా రూ.5 కోట్లతో నిర్మిస్తే రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది.