కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) హీరోగా నటించిన చిత్రం దేవర.( Devara ) జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం తాజాగా భారీ అంచనాల నడుమ విడుదల అయింది.
పాన్ ఇండియా లెవెల్ లో సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉంది? సినిమా కథ ఏమిటి? ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్న వివరాల్లోకి వెళితే.
కథ :
ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు సరిహద్దు రత్నగిరి ప్రాంతమది.సముద్రానికి ఆనుకొని ఉన్న ఒక కొండపై నాలుగు ఊర్లని కలిపి ఎర్ర సముద్రం అని పిలుస్తుంటారు.
ఆ పేరు వెనక బ్రిటిష్ కాలం నుంచి చరిత్ర ఉంటుంది.ఆ నాలుగు ఊళ్ల అవసరాల కోసం దేవర (ఎన్టీఆర్), భైర (సైఫ్ అలీఖాన్)( Saif Ali Khan ) వాళ్ల అనుచరులతో కలిసి ఎర్ర సముద్రం గుండా ప్రయాణం చేసే నౌకలపై ఆధారపడుతు ఉంటారు.
ఆ నౌకల్లో అక్రమ ఆయుధాల్ని దిగుమతి చేసుకుంటుంది మురుగ(మురళీశర్మ) గ్యాంగ్.అయితే సంద్రానికే ఎదురెళ్లి ఒడ్డుకు చేరుస్తున్న ఆ ఆయుధాలు తమకే ముప్పు తీసుకొస్తున్నాయని గ్రహించిన దేవర, ఇకపై ఆ పనుల్ని చేయకూడదనే నిర్ణయానికొస్తాడు.
బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని, చేపలు పట్టడంపై దృష్టి పెడదామని చెబుతాడు.కానీ భైర మాత్రం అందుకు ఒప్పుకోడు.దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది.దేవరని అడ్డు తొలగించుకుని సంద్రాన్ని శాసించాలనుకుంటాడు భైర.దేవర మాత్రం తాను అజ్ఞాతంలో ఉంటూ సంద్రం ఎక్కాలంటేనే భయపడేలా చేస్తుంటాడు.ఆ భయం ఎన్ని తరాలు కొనసాగింది? అజ్ఞాతంలో ఉన్న దేవర కోసం ఆయన తనయుడు వర (ఎన్టీఆర్) ఏం చేశాడు? చివరికి దేవర అనుకున్నట్లే బతకడానికి వేరే మార్గాన్ని అనుసరించారా! ఈ క్రమంలోనే గొడవలు ఏమైనా జరిగాయా? దేవర ని ఇష్టపడిన తంగం ఎవరు? చివరికి ఏం జరిగింది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
డైరెక్టర్ కొరటాల శివ( Koratala Siva ) ఈ సినిమా ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడంతో పాటు దాని చుట్టూ తన భావోద్వేగాలు ఘాడతతో కూడుకున్న కథను చెప్పే ప్రయత్నం చేశారు.ఇక ఎన్టీఆర్ కూడా ఎప్పటిలాగే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ సినిమాను చూసిన ప్రేక్షకులకు పాన్ ఇండియా తగ్గ సినిమా అనిపిస్తుంది.ముఖ్యంగా ఈ సినిమాలో ఇంటర్వెల్ అలాగే క్లైమాక్స్ సీన్లలో సన్నివేశాలు అద్భుతంగా అనిపిస్తాయి.ఫైట్ సీన్లు వేరే లెవెల్ అని చెప్పవచ్చు.బ్రిటిష్ కాలం నుంచీ ఎర్ర సముద్రానికి, అక్కడి జనాలకీ ఉన్న చరిత్ర, దానికి కాపలాగా ఉండే దేవర కథని సింగప్ప తో చెప్పిస్తూ కథని నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.
మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకుడికి గొప్ప థ్రియేటికల్ అనుభూతిని పంచుతుందని చెప్పాలి.ప్రథమార్ధంలో ఎర్ర సముద్రం కథ, దేవర, భైరవ పాత్రలు, పోరాట ఘట్టాలు, పాటలు ఇలా దేనికవే సాటి అనిపిస్తాయి.
అలాగే ద్వితీయార్ధంలో వర, తంగం పాత్రల సందడి మొదలవుతుంది.సరదా సరదాగా సాగే కొన్ని సన్నివేశాల తర్వాత మళ్లీ దేవర పాత్రని చూపెడుతూ గాఢతని పెంచే ప్రయత్నం కనిపిస్తుంది.
ఇక దేవర, భైర పాత్రల ముగింపు ఏమిటనేది రెండో భాగం కోసం దాచి పెట్టాడు కొరటాల శివ.
నటీనటుల పనితీరు :
దేవర పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు.అలాగే సైఫ్ అలీఖాన్ కూడా వర పాత్రలో ఒదిగిపోయారు.ఆ రెండు పాత్రలు ఢీ అంటే ఢీ అనేలా ఉంటాయి.
తంగం పాత్రలో జాన్వీ కపూర్( Janhvi Kapoor ) అందంగా కనిపించింది.చుట్ట మల్లే పాటతో సినిమాకి అందాన్ని తీసుకొచ్చింది.
అలాగే తన అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది జాన్వి కపూర్.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపుని తెచ్చుకుంది అని చెప్పాలి.
అలాగే మిగిలిన నటినటులు శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, అజయ్, శ్రుతి తదితరులు ఎవరి పాత్రల పరిధి మేరకు వారు బాగానే నటించారు.
సాంకేతికత :
రత్నవేలు కెమెరా పనితనం ఈ సినిమాకి హైలైట్ అని చెప్పాలి.విజువల్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్ పనితీరుతో సరికొత్త ప్రపంచం పక్కాగా తెరపై ఆవిష్కృతమైంది.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది.
అలాగే నేపథ్య సంగీతంతో అనిరుధ్ సినిమాపై మంచి ప్రభావం చూపించారు.పోరాట ఘట్టాల్ని డిజైన్ చేసిన తీరు కూడా మెప్పిస్తుంది కొరటాల శివ ప్రత్యేకతలన్నీ ఇందులో పక్కాగా కనిపిస్తాయి.
ఆయన మాటలు, కథా రచన, భావోద్వేగాలు ప్రభావం చూపించాయి.సినిమాలో పాటలు టెక్నికల్ పనితీరు కూడా బాగుందని చెప్పాలి.కెమెరా వర్క్స్ కూడా బాగానే ఉన్నాయి.