తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుసగా మంచి విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు.ఒక హిట్ ఇస్తే ఆ తర్వాత మరో రెండు ఫ్లాప్ లను ఇచ్చే హీరోలు ఉన్న ఈ రోజుల్లో వరుస సక్సెస్ లను సాధించడం అంటే మామూలు విషయం కాదు.
ఇక ప్రస్తుతం తనదైన రీతిలో ప్రభాస్ సలార్, కల్కి లాంటి రెండు సూపర్ సక్సెస్ లను అందుకొని ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మరోసారి పాన్ ఇండియాలో భారీ సక్సెస్ కొట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఆయనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతలా మంచి పేరును సంపాదించుకున్నాడు.
మరి ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాల విషయంలో చాలా ఆచి తూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్( Prabhas ) ప్రస్తుతం రాజాసాబ్ సినిమా ( Rajasaab movie )షూటింగ్ లో పాల్గొంటున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.ఇక వచ్చే సంవత్సరం జనవరి నెల నుంచి ఫౌజీ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఈలోపు రాజాసాబ్ సినిమాని కంప్లీట్ చేసి రిలీజ్ చేయడానికి ముస్తాబ్ చేయాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి రాజాసాబ్ విషయంలో ప్రభాస్ అంత పెద్ద సాటిస్ఫాక్షన్ తో లేనప్పటికీ ఆ సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేస్తే తన బాధ్యత తీరిపోతుందనే ఉద్దేశ్యంలో ప్రభాస్ ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఆ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుంది అనేది ఇప్పుడు అందరిలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
నిజానికి మారుతి( Maruthi ) లాంటి మీడియం రేంజ్ డైరెక్టర్ తో స్టార్ హీరో అయిన ప్రభాస్ సినిమా చేయడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.అయితే ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఈ సినిమాతో ఇటు మారుతి, అటు ప్రభాస్ ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది…
.